శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 25 ఆగస్టు 2020 (11:06 IST)

ముఖానికి మాస్కులేసుకుని ముద్దులు పెట్టుకోవాలా? సి.కళ్యాణ్

అన్‌లాక్-4 సండలింపుల్లో భాగంగా సినిమా షూటింగులతో పాటు.. మాల్స్, సినిమా థియేటర్లను తెరుచుకునేందుకు కేంద్రం అనుమతి ఇవ్వొచ్చన్న సంకేతాలు వినొస్తున్నాయి. ఇప్పటికే షూటింగులకు కేంద్రం అనుమతి ఇచ్చింది. అయితే, కోవిడ్ నిబంధనలకు లోబడి షూటింగులు జరుపుకోవాలన్న షరతు విధించింది. కానీ, అన్‌లాక్-4లో కూడా ఇలాంటి నిబంధనలతోనే షూటింగ్ జరుపుకునేలా కేంద్రం స్వేచ్ఛ ఇవ్వొచ్చు. దీనిపై ప్రముఖ టాలీవుడ్ నిర్మాత సి.కళ్యాణ్ స్పందించారు. 
 
కేంద్రం చెబుతున్నట్టుగా కోవిడ్ నిబంధనలకు లోబడిన షూటింగులు జరుపుకునే పరిస్థితి లేదన్నారు. ప్రభుత్వ విధివిధానాలతో షూటింగ్స్ ప్రారంభమయ్యే పరిస్థితి లేదని, దీనికి కారణం షూటింగుల్లో భౌతికదూరం పాటించలేమని, నటీనటులు మాస్క్‌లు వేసుకుని నటించలేరని ఆయన అన్నారు.కరోనాకు వ్యాక్సిన్ వచ్చి, అది అందరికీ దగ్గరైన తర్వాత మాత్రమే షూటింగ్స్ జరిగే అవకాశాలు ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. 
 
అలాగే, ప్రస్తుతానికి మాత్రం నటీ నటులు, సహాయక సిబ్బంది ధైర్యంగా షూటింగ్స్‌కు వచ్చే పరిస్థితి లేదని ఆయన అన్నారు. కరోనా సోకిన వారిలో రికవరీ రేటు సంతృప్తికరంగానే ఉన్నప్పటికీ, పలువురు చాలా దీనంగా మరణిస్తున్నారని, ఈ పరిస్థితుల్లో షూటింగులు జరపడం కష్టమేనని అన్నారు. సమీప భవిష్యత్తులో పరిస్థితి చక్కబడుతుందన్న నమ్మకం ఉందని కళ్యాణ్ చెప్పుకొచ్చారు. 
 
కాగా, అన్‌లాక్ 3లో షూటింగ్స్‌కు కేంద్రం అనుమతి ఇస్తూనే అనేక షరతులను విధించింది. మరో వారంలో ప్రారంభమయ్యే అన్‌లాక్ 4.0లో థియేటర్లకు అనుమతి ఇస్తారని తెలుస్తోంది. అయితే, కోవిడ్ నిబంధనలను చిత్ర యూనిట్ పాటించాలని, భౌతికదూరం, మాస్క్‌లు, శానిటైజేషన్ తప్పనిసరని పేర్కొంది. ఇక సినిమా హాల్స్ విషయంలోనూ సీటింగ్ సిస్టమ్ మార్చాలని, ప్రేక్షకుల మధ్య దూరం ఉండాల్సిందేనని స్పష్టం చేసింది.