శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 29 ఫిబ్రవరి 2024 (10:18 IST)

పీవీ నరసింహారావు బయోపిక్.. 'హాఫ్ లయన్' పేరిట రిలీజ్

PV Narasimha Rao Biopic
PV Narasimha Rao Biopic
దివంగత ప్రధాని పీవీ నరసింహారావు జీవిత చరిత్రపై బయోపిక్‌ సిరీస్‌కు సంబంధించిన వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఇటీవలే పీవీ మరణానంతరం ప్రతిష్టాత్మకమైన భారతరత్నతో సత్కరించడంతో, పీవీ బయోపిక్‌ తెరకెక్కుతోంది. ఈ సినిమాకు 'హాఫ్ లయన్' అని పేరు పెట్టారు.
 
దీనికి జాతీయ అవార్డు గెలుచుకున్న చిత్ర నిర్మాత ప్రకాష్ ఝా దర్శకత్వం వహిస్తున్నారు. వినయ్ సీతాపతి రచించిన "హాఫ్ లయన్" పుస్తకం ఆధారంగా ఈ బయోపిక్ రూపొందుతుండగా, భారతదేశాన్ని ధీటుగా పాలించిన తెలుగు తేజం గురించి కాంగ్రెస్ పార్టీ ఎప్పటినుంచో దాచిపెట్టిన కొన్ని వాస్తవాలను ఈ సిరీస్ చూపుతుందా అనేది తెలియాల్సి వుంది.
 
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 1991 నుండి 1996 వరకు తన పదవీ కాలంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థను విప్లవాత్మకంగా మార్చడంలో కీలక పాత్ర పోషించారు.