శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 15 డిశెంబరు 2020 (17:53 IST)

'డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ'తో వచ్చేస్తోన్న శివానీ..?

డా. రాజశేఖర్, జీవిత దంపతుల చిన్న కూతురు శివాత్మిక ఇప్పటికే 'దొరసాని' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాజశేఖర్ జీవిత దంపతుల పెద్ద కుమార్తె శివానీ.. అదిత్ అరుణ్ సరసన ఓ సినిమాలో నటిస్తోంది. '118' మూవీతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిపించుకున్న సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.
 
డా. రవి పి. రాజు దాట్ల నిర్మిస్తున్న ఈ సినిమాకు 'డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ' అనే పేరు పెట్టారు. అంటే 'హూ, వేర్, వై' అని అర్థం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న దీనిని హై టెక్నికల్ వాల్యూస్ తో నిర్మిస్తున్నామని, ఈ డిఫరెంట్ థ్రిల్లర్ కు మిర్చి కిరణ్ పవర్ ఫుల్ డైలాగ్స్ రాశారని నిర్మాత చెబుతున్నారు. సిమన్ కె కింగ్ సంగీతం అందిస్తున్న 'డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ' మూవీకి దర్శకత్వం వహించడంతో పాటు కెవి గుహన్ కథను, సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు.