కడప దర్గాకు రామ్ చరణ్.. అప్పుడు మగధీర హిట్.. ఇప్పుడు గేమ్ ఛేంజర్?
మగధీర ముందు కూడా స్టార్ హీరో రామ్ చరణ్ కడప దర్గాకు వెళ్లారు. ఆ సినిమా చరణ్ కెరీర్‌లో పెద్ద హిట్‌గా నిలిచింది. ఇప్పుడు గేమ్ ఛేంజర్ సినిమా ముందు కూడా కడప దర్గాకు వెళ్లడంతో ఈ సినిమా కుడా పెద్ద హిట్ అవుతుందని అంటున్నారు ఫ్యాన్స్.
చరణ్ ఏఆర్ రెహ్మాన్‌కు ఇచ్చిన మాట ప్రకారం మాలలో ఉన్నా కూడా కడప దర్గాకు రావడం గమనార్హం. చరణ్ కోసం అన్ని వేల మంది అభిమానులు రావడంతో ప్రస్తుతం ఆ వీడియోలు వైరల్‌గా మారాయి.
ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ.. దర్గా 80వ నేషనల్ ముషాయిరా గజల్ ఈవెంట్‌కు తనను పిలిపించినందుకు నిర్వాహకులకు ధన్యవాదాలు. తన కోసం వచ్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. 12 సంవత్సరాల తర్వాత మళ్లీ ఇక్కడికి వచ్చాను.
మగధీర సమయంలో వచ్చాను. మళ్లీ ఇప్పుడు వచ్చాను. ఈ దర్గాకు ఎప్పటికీ తాను రుణపడి వుంటానని.. బుచ్చిబాబు చేయనున్న సినిమాకు ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారని.. ఆ కార్యక్రమం కోసం వచ్చాను.
ఈ ముషాయిరా గజల్ ఈవెంట్‌కు వస్తానని రెహ్మాన్‌కి మాటిచ్చాను. మాట ప్రకారం ఈ ఈవెంట్‌కి వచ్చాను. ఇప్పుడు అయ్యప్ప మాలలో వున్నప్పటికీ ఇక్కడికి రావడం సంతోషంగా వుందన్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ పనులతో బిజీగా వున్నారు. ఈ సినిమా జనవరి 10న రిలీజ్ కానుంది.