బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 13 ఏప్రియల్ 2018 (09:04 IST)

"రంగస్థలం" మొక్కు తీర్చుకున్న చిట్టిబాబు భార్య... నేడు సక్సెస్ మీట్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన శ్రీనివాసుడికి మొక్కు తీర్చుకున్నారు. తన భర్త నటించిన తాజా చిత్రం రంగస్థలం సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెల్సిందే. ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. దీంతో

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన శ్రీనివాసుడికి మొక్కు తీర్చుకున్నారు. తన భర్త నటించిన తాజా చిత్రం రంగస్థలం సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెల్సిందే. ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. దీంతో చెర్రీ భార్య కామినేని ఉపాసన కాలినడకన వెళ్లి ఏడుకొండల వాడిని దర్శించుకున్నారు.
 
గురువారం సాయంత్రం నడకను ప్రారంభించిన ఆమె, కొన్ని ఫోటోలను తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు. ఆపై శుక్రవారం ఆమె వీఐపీ బ్రేక్ సమయంలో స్వామిని దర్శించుకున్నారు. తితిదే సిబ్బంది ఆమెకు దర్శన ఏర్పాట్లు చేశారు. కాగా, రెండు వారాల క్రితం విడుదలైన 'రంగస్థలం' బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లను రాబడుతూ దూసుకెళుతున్న సంగతి తెలిసిందే.
 
మరోవైపు రంగస్థలం సక్సెస్ మీట్ హైదరాబాద్, యూసఫ్‌గూడలోని పోలీస్ మైదానంలో శుక్రవారం సాయంత్రం 6 గంటలకు జరుగనుంది. ఈ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అలాగే, మెగాస్టార్ చిరంజీవి కూడా హాజరుకావొచ్చని భావిస్తున్నారు. ఇందుకోసం చిత్ర నిర్మాతలు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్ అంతా పాల్గొననుంది.