బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 28 నవంబరు 2019 (14:26 IST)

కమ్మ రాజ్యంలో కడప రెడ్లు.. రామ్ గోపాల్ వర్మ టార్గెట్ ఏంటి?

కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అంటూ రామ్ గోపాల్ వర్మ మరోసారి ఆంధ్ర రాజకీయాలు టార్గెట్ చేస్తూ పెద్ద దుమారం రేపుతున్నారు. ఈ సినిమా టైటిల్‌తోనే సంచలనం సృష్టించిన వర్మ ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్‌ని విడుదల చేసి పెద్ద దుమారం రేపాడు. 
 
కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా ద్వారా మరోసారి చంద్రబాబును నారా లోకేష్ ను టార్గెట్ చేయబోతున్నారా... లేక ఆంధ్ర రాజకీయాల్లోని అందర్నీ టార్గెట్ చేస్తూ సినిమా రాబోతోందా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. 
 
తాజాగా విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్ పాటలతో మరోసారి టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుని టార్గెట్ చేస్తున్నట్లు స్పష్టంగా అర్థమైంది. కానీ అటు సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ మాత్రం తన సినిమాలో ఏపీ రాజకీయాల్లోని అందరి గురించి ఉంటుందని చెబుతున్నారు. 
 
ఇదిలా ఉంటే వర్మ విడుదల చేసిన ట్రైలర్లో అప్పటి లోపు బుడ్డోడు పార్టీని లాగేసుకుంటే అనే డైలాగ్ ఉంది. ఈ నేపథ్యంలో వర్మ తన సినిమాలు జూనియర్ ఎన్టీఆర్ టిడిపి పార్టీపై ఏమైనా ప్రభావం చూపుతున్నట్టు చూపిస్తాడా అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది.