గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 20 ఆగస్టు 2019 (15:36 IST)

షెర్లిన్ చోప్రాకు వర్మ షాక్.. సన్నీ లియోన్ అలానే స్టార్ అయ్యింది..

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ బాలీవుడ్ నటి షెర్లిన్ చోప్రా తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అవకాశం అడిగినందుకు వర్మ.. సెక్స్ వీడియోలు పంపాడని చెప్పింది.


అభ్యంతరకరమైన సన్నివేశాలపై వర్మను తాను ప్రశ్నించానని, అప్పుడు వర్మ సన్నీ లియోన్‌ను ఉదహరించాడని షెర్లిన్ వెల్లడించింది. అడల్ట్ సినిమాల్లో నటిస్తే సన్నీ లియోన్ మాదిరి గొప్ప స్టార్ అవుతావని చెప్పాడని మండిపడింది.
 
ఇందుకు వర్మ ఘాటుగా సమాధానమిచ్చాడు. బాలీవుడ్ సినిమాల్లో నటించడం ద్వారానే సన్నీలియోన్ స్టార్ అయ్యిందని చెప్పాడు. అడల్ట్ సినిమాల్లో నటించడం ద్వారా కాదని చెప్పానని షెర్లిన్ వెల్లడించింది.

సినీరంగంలోని కొందరు నిర్మాతలు కూడా తనపై చెడు వ్యాఖ్యలు చేశారని చెప్పింది. ప్రస్తుతం తనకు ఎవరి సహాయ, సహకారాలు అవసరం లేదని తెలిపింది. తనకే ఒక సొంత ప్రొడక్షన్ హౌస్ ఉందని చెప్పింది.