సన్నీ లియోన్ నెంబర్ వన్: మోదీ, ఖాన్‌లను వెనక్కి నెట్టేసింది..
సోషల్ మీడియాలో సన్నీ లియోన్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని వెనక్కి నెట్టేసింది. సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్న ఈ భామ.. గూగుల్ ఇండియా సెర్చింగ్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. తనపైనున్న పోర్న్ స్టార్ ముద్రను ఇప్పుడిప్పుడే తొలగించుకుంటున్న ఈ బ్యూటీ, గూగుల్ ట్రెండ్స్ అనలైటిక్స్‌లో దూసుకుపోతోంది.
అంతేకాకుండా దేశ ప్రధాని మోదీ, బాలీవుడ్ ఖాన్ దిగ్గజాలైన షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్‌లను కూడా వెనక్కి నెట్టేసింది. గూగుల్ అనలిటిక్స్‌లో ఆమె వీడియోలు సహా తానే స్వయంగా నటించిన.. బయోపిక్ ‘కరణ్‌జిత్ కౌర్: ద అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ సన్నీ లియోన్’ నెట్టింట్లో వైరల్ అవుతోంది.
ముఖ్యంగా భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాల్లోని మణిపూర్, అస్సాం రాష్ట్రాల ప్రజలు సన్నీలియోన్‌ను బాగా సెర్చ్ చేస్తున్నారు. గూగుల్ సెర్చింగ్‌లో మీరే ట్రెండ్ అవుతున్నారు. దీనిపై స్పందించాలని సన్నీ లియోన్‌ను కోరగా, తనపై ఇంత అభిమానాన్ని చూపించే అభిమానులకు ఆమె ధన్యవాదాలు తెలిపింది. ఈ విషయం ఇప్పుడే తనకు తెలియవచ్చిందని చెప్పుకొచ్చింది.