సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Srinivas
Last Modified: మంగళవారం, 19 జూన్ 2018 (15:09 IST)

వర్మ మ‌రో సినిమా ప్ర‌క‌టించాడు... సినిమా చిత్తయినా ఆఫర్లు ఎలా?

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ఆఫీస‌ర్ అట్ట‌ర్ ఫ్లాప్ అవ్వ‌డం... ఆ త‌ర్వాత త‌దుప‌రి చిత్రానికి చాలా స‌మ‌యం తీసుకుంటాడు అనుకుంటే... అంద‌రికీ షాక్ ఇస్తూ వైర‌స్ అనే సినిమాని ఎనౌన్స్ చేయ‌డం తెలిసిందే. తాజాగా మ‌రో సినిమాని కూడా ఎనౌన్స్ చేసాడు వ‌ర్మ‌

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ఆఫీస‌ర్ అట్ట‌ర్ ఫ్లాప్ అవ్వ‌డం... ఆ త‌ర్వాత త‌దుప‌రి చిత్రానికి చాలా స‌మ‌యం తీసుకుంటాడు అనుకుంటే... అంద‌రికీ షాక్ ఇస్తూ వైర‌స్ అనే సినిమాని ఎనౌన్స్ చేయ‌డం తెలిసిందే. తాజాగా మ‌రో సినిమాని కూడా ఎనౌన్స్ చేసాడు వ‌ర్మ‌.  భైరవ గీతం అనే సినిమాకు తను నిర్మాతగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. ఇందులో కన్నడ నటుడు ధనంజయ కథానాయకుడిగా నటిస్తున్నట్లు పేర్కొన్నారు.
 
దీంతోపాటు సినిమాకు సంబంధించిన ఓ పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు. శనివారం రాత్రి జరిగిన ఫిల్మ్‌ఫేర్‌ వేడుకలో ధనంజయ ఉత్తమ నటుడు (కన్నడ-క్రిటిక్)‌ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా కొత్త ప్రాజెక్టు వివరాలను ప్రకటించినట్లు వర్మ సోషల్‌మీడియా వేదికగా తెలియ‌చేసారు. 
 
ఇందులో ధనంజయ భైరవ అనే పాత్రలో కనిపించనున్నారని.. ఇది ఓ ప్రేమకథ అన్నారు. రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఓ యువకుడు ఎలా రెబల్‌‌గా మారాడన్నదే కథ అని చెప్పారు. ఈ సినిమాను నూతన దర్శకుడు సిద్ధార్థ్‌ తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను ఈ నెల‌ 21న రిలీజ్ చేయ‌నున్నారు.