శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : బుధవారం, 27 జూన్ 2018 (09:37 IST)

రంగస్థలం కొత్త రికార్డు... పోకిరి, ఇంద్ర, ఖుషీ రికార్డులను బ్రేక్ చేసింది..

మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ నటించిన ''రంగస్థలం'' మరో రికార్డును బద్ధలుకొట్టింది. ఈ ఏడాది బ్లాక్‌బస్టర్ హిట్స్‌లో ఒకటిగా నిలిచిన ''రంగస్థలం'' మరో రికార్డును బద్ధలు కొట్టింది. ఆర్టీసీ క్రాస్ రో

మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ నటించిన ''రంగస్థలం'' మరో రికార్డును బద్ధలుకొట్టింది. ఈ ఏడాది బ్లాక్‌బస్టర్ హిట్స్‌లో ఒకటిగా నిలిచిన ''రంగస్థలం'' మరో రికార్డును బద్ధలు కొట్టింది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో వున్న సుదర్శన్ 35 ఎంఎం సినిమా హాలులో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రంగస్థలం నిలిచింది.
 
12 సంవత్సరాల క్రితం విడుదలైన పోకిరి, సుదర్శన్ 35 ఎంఎం థియేటర్‌లో రూ.1,61,43,081 వసూలు చేసింది. ఇక రంగస్థలం విడుదలైన 89 రోజుల్లో రూ.1.62కోట్లు రాబట్టి సరికొత్త రికార్డును సృష్టించింది. 
 
మరోవైపు.. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తేజ్, సమంత‌లు జంట‌గా న‌టించిన మూవీ రంగ‌స్థ‌లం. మార్చి30న భారీ ఎత్తున విడుదలైన రంగస్థలం చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నాన్ బాహుబలి రికార్డులను బద్దలు కొట్టి బాహుబలి సరసన నిలిచింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీస్ సంస్థ నిర్మించింది.
 
ఇంతకుముందు ఇదే విజయవాడలో చిరంజీవి నటించిన ఇంద్ర, పవన్ కళ్యాణ్ నటించిన ఖుషీ చిత్రాలు కోటి రూపాయల గ్రాస్ వసూల్ చేయగా ఇప్పుడు రంగస్థలం ఆ రికార్డులను కూడా బద్దలు కొట్టింది. 66 రోజులకు గాను ఒక కోటి 5 లక్షల 63 వేల రూపాయలు వసూల్ చేసింది.