ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శనివారం, 9 డిశెంబరు 2017 (16:02 IST)

రంగస్థలం 1985 ఫోటోస్.. ఫస్ట్ లుక్‌లో చెర్రీ ఊరా మాస్

రంగస్థలం 1985 సినిమా ఫస్ట్ లుక్‌ విడుదలైంది. మెగాఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫస్ట్ లుక్ పోస్టర్‌కు షేర్లు, లైకులు, కామెంట్లు వెల్లువెత

రంగస్థలం 1985 సినిమా ఫస్ట్ లుక్‌ విడుదలైంది. మెగాఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫస్ట్ లుక్ పోస్టర్‌కు షేర్లు, లైకులు, కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ఫస్ట్ లుక్‌లో హీరో రామ్ చరణ్ గెటప్ ఆకట్టుకునేలా ఉంది. మాస్ బాడీ లాంగ్వేజ్‌తో పక్కా పల్లెటూరి యువకుడిలా చెర్రీ కనిపించారు. 
 
ఫస్ట్ లుక్‌తో ఈ సినిమాపై అంచనాలు పెంచేసిన సుకుమార్ శనివారం ఈ సినిమాకు సంబంధించిన కొన్ని స్టిల్స్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ఈ ఫోటోల్లో సమంత లుక్ అదిరిపోయింది. ఆది పినిశెట్టి లుక్‌ కూడా సూపర్ అనిపించింది. ఇక చెర్రీ ఫస్ట్ లుక్ పోస్టర్లను అభిమాను బైకులపై ముద్రించుకుని హంగామా చేస్తున్నారు. చిట్టిబాబు పోస్టర్‌కు పాలాభిషేకాలు చేస్తున్నారు. ఇక రంగస్థలం 1985 సినిమా ప్రస్తుతం చివరి దశ షూటింగ్ జరుపుకొంటోంది. ఈ సినిమాకు చెందిన కొన్ని ఫోటోస్ మీ కోసం..