శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By TJ
Last Modified: గురువారం, 23 నవంబరు 2017 (22:00 IST)

రాజకీయ ప్రవేశంపై పిచ్చెక్కించే ప్రశ్న వేసిన రజినీకాంత్

సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచనను పూర్తిగా మానుకున్నారు. ఇప్పటివరకు రజినీ రాజకీయాల్లోకి వస్తారని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తే ఆ ఆశ కాస్తా నిరాశగా మారిపోయింది. తను రాజకీయాల్లోకి వచ్చేది లేదని రజినీకాంత్ తేల్చి చెప్పారు. నేన

సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచనను పూర్తిగా మానుకున్నారు. ఇప్పటివరకు రజినీ రాజకీయాల్లోకి వస్తారని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తే ఆ ఆశ కాస్తా నిరాశగా మారిపోయింది. తను రాజకీయాల్లోకి వచ్చేది లేదని రజినీకాంత్ తేల్చి చెప్పారు. నేనెందుకు రాజకీయాల్లోకి రావాలన్న ప్రశ్న కూడా వేశారు రజినీకాంత్. సినిమాల్లో బిజీగా ఉన్నా. నాకు ఇక్కడే ప్రశాంతంగా ఉంది. నాకు అభిమానులు ఉన్నారు. వారిని సంతృప్తి పరచడమే నాకెంతో ఇష్టమంటూ రజినీ చెప్పారు.
 
ఇప్పటికే 2.0ఓ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న రజినీ ఈ విషయాన్ని వెల్లడించారు. రజినీ ప్రకటనతో అభిమానుల్లో తీవ్ర నిరాశ వ్యక్తమవుతోంది. ఎప్పుడో ఒకప్పుడు రాజకీయాల్లోకి తలైవా(రజినీకాంత్) వస్తారని అనుకున్నాం గాని, ఆయన చివరకు రానని ప్రకటన చేయడంపై అభిమానులు నిశ్భబ్థంగా ఉండిపోయారు. అభిమానులెవరూ మీడియా ముందుకు రావడం లేదు.