మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : బుధవారం, 15 ఆగస్టు 2018 (12:14 IST)

స్వాతంత్ర్యదినోత్సవం.. మాస్ మహారాజా కాన్సెప్ట్ పోస్టర్ వచ్చేసింది..

కామెడి సినిమాలను తెరకెక్కించడంలో తనకంటూ ఒక మార్క్ సంపాదించుకున్న దర్శకుల్లో శ్రీనువైట్ల ఒకరు. తాజాగా మాస్ మహారాజ రవితేజతో అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాను శ్రీనువైట్ల తెరకెక్కించబోతున్నాడు. ఈ సినిమా షూటింగ

కామెడి సినిమాలను తెరకెక్కించడంలో తనకంటూ ఒక మార్క్ సంపాదించుకున్న దర్శకుల్లో శ్రీనువైట్ల ఒకరు. తాజాగా మాస్ మహారాజ రవితేజతో అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాను శ్రీనువైట్ల తెరకెక్కించబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తమన్ సంగీతం అందించబోతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించబోతోంది. ఇందులో రవితేజ త్రిపాత్రాభినయం చేస్తున్నాడని.. హీరోయిన్స్ కూడా ముగ్గురు కనిపిస్తారని తెలిసింది. 
 
ఈ ఏడాది టచ్ చేసి చూడు, నేల టికెట్ మూవీలతో ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాడు. దీంతో నేలటికెట్ మూవీ రవితేజ కెరీర్‌లోనే అత్యంత తక్కువ కలెక్షన్స్ వసూలు చేసిన చిత్రంగా రికార్డుల కెక్కింది. ప్రస్తుతం మాస్‌ మహారాజా శ్రీనువైట్లతో చేసే సినిమాపైనే ఆశలు పెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో ఈ పంద్రాగష్టు సందర్భంగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్‌ను విడుదల చేశారు. హీరో లేకుండా ఓన్లీ టైటిల్స్‌తో రెండు బొమ్మలను, ఒక ఉంగరంతో వున్న ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.