గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: సోమవారం, 3 జులై 2017 (12:57 IST)

నాకా ఫోబియా... వాడి ప్రాణాలు తీయడానికే ఆ లారీ ఆగివుంది... ఏడ్చేసిన రవితేజ

రవితేజ తన సోదరుడు భరత్ దుర్మరణం పాలవడంపై మొన్నటివరకూ మీడియా ముందుకు రాలేదు. చివరికి రావాల్సి వచ్చింది. ఆయన మీడియాతో మాట్లాడుతూ... గత కొన్ని రోజులుగా తన తమ్ముడి భరత్ అంత్యక్రియలకు తను రాకపోవడంపై ఏవేవో రాసేశారని చెపుతూ ఇలా అన్నారు. తనకు చిన్నప్పట్నుంచి

రవితేజ తన సోదరుడు భరత్ దుర్మరణం పాలవడంపై మొన్నటివరకూ మీడియా ముందుకు రాలేదు. చివరికి రావాల్సి వచ్చింది. ఆయన మీడియాతో మాట్లాడుతూ... గత కొన్ని రోజులుగా తన తమ్ముడి భరత్ అంత్యక్రియలకు తను రాకపోవడంపై ఏవేవో రాసేశారని చెపుతూ ఇలా అన్నారు. తనకు చిన్నప్పట్నుంచి శవాన్ని చూస్తే భయం అనీ, తనకు అలాంటి ఫోబియా ఉందన్నారు. అందుకే నటుడు శ్రీహరి చనిపోయినప్పుడు కూడా తను హాజరు కాలేదన్నారు. 
 
ఇతరుల విషయంలోనే నేను ఇలావుంటే ఇక నా సొంత తమ్ముడు చనిపోతే ఎలా వుంటాను... అందుకే రాలకేపోయాను. వాడి అంత్యక్రియలను ఎవరో జూనియర్ ఆర్టిస్టుతో చేయించారని వార్తలు రాశారు. కానీ వాడికి తలకొరివి పెట్టింది మా అమ్మ సోదరి భర్త. అంత్యక్రియలు కూడా చేసుకోలేనంత హీనంగా మేము లేము. 
 
నా తమ్ముడు భరత్‌ను మా పిల్లలు బాబాయ్ అని పిలవరు. నాన్నా అని పిలుచుకుంటారు. వాడంటే వారికి అంత ప్రేమ. ఇప్పటికీ వారు నా తమ్ముడిని తలుచుకుని ఏడుస్తున్నారు. అలాంటి నా తమ్ముడి ప్రాణం తీసేందుకు ఆ రోడ్డుపై లారీ ఆగి వుందంటూ ఏడ్చేశారు రవితేజ.