శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 26 ఆగస్టు 2021 (16:11 IST)

#RRR షూటింగ్ ఓవర్.. విజయదశమి కానుకగా విడుదల

ఎన్టీఆర్, చరణ్‌ హీరోలుగా రాజమౌళి తీస్తున్న ప్యాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ మొత్తం పూర్తయింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థలు ట్వీట్ ద్వారా తెలియచేశాయి. 
 
ఒకటి రెండు పికప్ షాట్స్ తప్ప సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిందని, నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని, రిలీజ్ తదితర ఇతర అప్ డేట్స్ ని వీలయినంత త్వరగా ప్రకటిస్తామని మీడియాకు తెలియచేశాయి. 
 
ఇటీవల ఉక్రెయిన్ లో చేసిన చివరి షెడ్యూల్ తో ఈ సినిమా మొత్తం పూర్తయింది. అక్టోబర్ లో విజయదశమి కానుకగా విడుదల అవుతుందని అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే సినిమా వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ అవుతుందని సోషల్ మీడియాలో వినిపిస్తోంది