బెయిల్‌పై బయటపడ్డ హీరో సచిన్ జోషి
తెలుగు సినిమాలో ఒకప్పుడు హీరోగా మూడు సినిమాలు చేసిన సచిన్ జోషి ఆ తర్వాత కొంతకాలం కనుమరుగయ్యాడు. నీ జతగా నేనుండాలి సినిమాను చేసిన తర్వాత అన్ని బాధ్యతలు బండ్ల గణేస్‌కు అప్పగించాడు. ఆ తర్వాత అది డిజాస్టర్ అవడం లావాదేవీలలో మోసం చేశాడంటూ బండ్గ గణేష్‌కు కేసుపెట్టడం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత రాజీపడినట్లు సమాచారం. ఇక ఆ తర్వాత సచిన్ హిందీ సినిమాలలోనూ నటించాడు. గుట్కాఅధినేత కుమారుడిగా పేరున్న సచిన్ రియల్ ఎస్టేట్ వివాదం వున్నాడు.
మార్చి 2020లో మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లోని సిటీ చౌక్ పోలీస్ స్టేషన్ లో దాఖలైన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఎం/ఎస్ ఓంకార్ గ్రూప్ ప్రమోటర్లపై ED దర్యాప్తు ప్రారంభించింది. దీని తర్వాత అతన్ని 2021లో జైలులో పెట్టారు. తాజాగా ఓంకార్ రియల్టర్స్ అండ్ డెవలపర్స్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ప్రత్యేక PMLA కోర్టు వ్యాపారవేత్త, నటుడు, నిర్మాత సచిన్ జోషికి సోమవారం (మార్చి 7) షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పలు సెక్షన్ల కింద ఆయన్ను అరెస్ట్ చేశారు. . ప్రస్తుతం ఆయన సుప్రీంకోర్టు మంజూరు చేసిన మెడికల్ బెయిల్‌పై బయట ఉన్నారు. ఈ సందర్భంగా ముంబైలోని మీడియా సచిన్ బయటికి వచ్చాడంటూ కథనాలు రాశాయి.