మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Updated : ఆదివారం, 1 మే 2016 (17:51 IST)

విశాల్-వరలక్ష్మిల ''మదగజరాజ'' రిలీజ్ ఎప్పుడు?: సదా స్పెషల్ సాంగ్..!

సూపర్ మాస్ హీరో విశాల్- గ్లామర్ క్వీన్స్ అంజలి-వరలక్ష్మీశరత్ కుమార్ జంటగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ సుందర్ సి. దర్శకత్వంలో రూపొందిన "మదగజరాజ" ఆడియో ఇటీవల విడుదల కావడం తెలిసిందే. "మదగజరాజ" తమిళ వెర్షన్‌ను నిర్మిస్తున్న జెమిని ఫిలిం సర్క్యూట్.. తెలుగులో ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని సమర్పిస్తుండగా.. శ్రీ ఓబులేశ్వర ప్రొడక్షన్స్ పతాకంపై యువ నిర్మాత తమటం కుమార్ రెడ్డి నిర్మిస్తున్నారు.
 
రొక్కం సోమ శేఖర్ రెడ్డి సహ నిర్మాత. అందాల భామ సదా ఓ స్పెషల్ సాంగ్‌లో నర్తించిన ఈ చిత్రంలో సోనుసూద్, సుబ్బరాజు, శరత్ సక్సేనా, సంతానం ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. విజయ్ అంటోని సంగీత సారధ్యంలో జెమిని మ్యూజిక్ ద్వారా ఇటీవల విడుదలైన "మదగజరాజ" పాటలకు విశేషమైన స్పందన లభిస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెల రెండో వారంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 
 
ఈ సందర్భంగా నిర్మాత తమటం కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. "సూపర్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ సుందర్.సి దర్శకత్వ ప్రతిభ, తమిళ, తెలుగు భాషల్లో తిరుగులేని మాస్ హీరోగా వెలుగొందుతున్న విశాల్ చేసిన డేర్ డెవిల్ ఫైట్స్ మరియు యాక్షన్ సీక్వెన్సెస్- అంజలి, వరలక్ష్మీశరత్ కుమార్ గ్లామర్, సదా స్పెషల్ సాంగ్, విజయ్ అంటోని మ్యూజిక్.. "మదగజరాజ" చిత్రానికి ప్రధాన ఆకర్షణలు. 
 
విశాల్‌కి తెలుగులో గల క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రాన్ని ఈ నెల రెండోవారంలో అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. మా బ్యానర్ నుంచి వచ్చిన "జిల్లా" చిత్రం కంటే "మదగజరాజ" మరింత పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం మాకుంది" అన్నారు.