ఆదివారం, 26 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వాసు
Last Updated : బుధవారం, 17 ఏప్రియల్ 2019 (19:38 IST)

ఫేస్ క్రీములు రాసుకునే మహిళలు సాయి పల్లవిని చూసి నేర్చుకోవాలి... ఏంటో తెలుసా?

తన నటనతో దక్షిణాది ప్రేక్షకుల మనసుని దోచేసుకున్న సాయిపల్లవి... తాజాగా తన చేతికి అందివచ్చిన రూ.2 కోట్ల భారీ ఆఫర్‌ని తిరస్కరించిందట. సాయిపల్లవి... ఎలాంటి మేకప్‌లకు ప్రాధాన్యం ఇవ్వకుండా నేచురల్‌గా కనిపిస్తూనే నేచురల్ నటన కనబర్చడమనేది ఆమెకే సొంతం.

అయితే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకున్నట్లు... పలువురు సెలబ్రిటీలు.. ఒక పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క పలు వాణిజ్య ప్రకటనల ద్వారా భారీగా సొమ్ము చేసేసుకుంటున్న ఈ రోజుల్లో తాను మాత్రం ఎలాంటి ప్రకటనలలో నటించబోనని గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్న సాయిపల్లవి తాను అన్నంత పనీ చేసేసింది.
 
వివరాలలోకి వెళ్తే... తాజాగా ఓ ప్రముఖ ఉత్పత్తుల సంస్థ వారు తమ ఫేస్ క్రీమ్ ప్రకటనలో నటించేందుకుగానూ.. రూ.2 కోట్లు ఆఫర్ చేశారట. కానీ ఆమె అందుకు తిరస్కరించడమేకాకుండా ఎలాంటి మేకప్ లేకుండా సినిమాల్లోనే నటిస్తున్న తాను మీ ఉత్పత్తులను మాత్రం ఎలా ప్రమోట్ చేస్తానని ప్రశ్నించిందట. పోనీ మేకప్ లేకుండానే మా ప్రకటనలో కనిపించండి అని సదరు సంస్థ సూచించినప్పటికీ... నో చెప్పేసిందట సాయిపల్లవి. మొత్తానికి ఈ రకంగా ఆమె ప్రత్యేకతని నిరూపించేసుకుంటోంది కదూ.