శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 3 ఫిబ్రవరి 2017 (14:05 IST)

చైతూతో ఎంగేజ్‌మెంట్ తర్వాత మామగారైన నాగ్‌తో సమంత సినిమా.. ''రాజు గారి గది-2''లో?

ఏ మాయ చేసావె సినిమా ద్వారా తెరంగేట్రం చేసిన సమంత.. తన సినీ కెరీర్‌లో హీరోయిన్‌గా మంచి ఛాన్సులు కొట్టేసింది. అయితే తొలిసారిగా హారర్ కామెడీలో సమంత కనిపించనుంది. ఏ మాయ చేసావె నుంచి జనతా గ్యారేజ్ వరకు కథ

ఏ మాయ చేసావె సినిమా ద్వారా తెరంగేట్రం చేసిన సమంత.. తన సినీ కెరీర్‌లో హీరోయిన్‌గా మంచి ఛాన్సులు కొట్టేసింది. అయితే తొలిసారిగా హారర్ కామెడీలో సమంత కనిపించనుంది. ఏ మాయ చేసావె  నుంచి జనతా గ్యారేజ్ వరకు కథానాయికగా మంచి నటనకు మార్కులు కొట్టేసిన సమంత.. తన కెరీర్‌లోనే తొలిసారిగా విభిన్న పాత్రల వైపు మొగ్గుచూపుతోంది. ఇందులో భాగంగా సమంత ''రాజు గారి గది 2'' హారర్ కామెడీ కోసం సంతకం చేసింది. 
 
ఈ సినిమాలో సమంత తన మామగారైన నాగార్జునతో కలిసి నటించనుంది. ఈ సినిమా 2015లో రిలీజైన రాజు గారి గది సినిమాకు సీక్వెల్. నాగచైతన్యతో ఎంగేజ్‌మెంట్ అయిన తర్వాత సమంత సంతకం చేసిన తొలి ప్రాజెక్ట్ ఇదే. ఈ చిత్రానికి ఓంకార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాలో నాగార్జున, సమంతలతో పాటు సీరత్ కపూర్, వెన్నెల కిషోక్, షకలక శంకర్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీవీపీ సినిమా- మాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.