ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 29 మే 2024 (11:43 IST)

ఇది నాటు నాటు పాట కాదు.. సమంతను చేనేత బ్రాండ్‌ అంబాసిడర్‌గా..?

Samantha
జయజయహే తెలంగాణ గీతానికి సంగీత దర్శకుడు కీరవాణి స్వరకల్పన చేయడానికి ఇది నాటు నాటు పాట కాదని బీఆర్‌ఎస్‌ నేత ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ స్పష్టం చేశారు. నాటి ఆంధ్ర పాలకుల పెత్తనంపై తిరుగుబాటు బావుటా ఎగరేసిన వందలాది మంది అమరుల త్యాగాలు, నాలుగు కోట్ల మంది ప్రజల కలల ప్రతిరూపం అని మంగళవారం ఎక్స్‌ వేదికగా ఆయన పేర్కొన్నారు. 
 
ఇకపోతే.. అప్పట్లో మంత్రి కేటీఆర్ సమంతను తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తున్నట్లు ట్విట్టర్‌లో ప్రకటించారు. తెలంగాణలో ఎంతో మంది ఉండగా ఆమెనే ఎందుకు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించారు అని కొందరు అప్పట్లో ప్రశ్నలు కూడా లేవనెత్తారు. అసలే బ్రాండ్ అండాసిడర్ అంటే బోలెడు డబ్బులు కురిపించే సర్కారు ఈమెకు ఎంత ముట్టజెప్పారోనని గుసగుసలాడుకుంటున్నారు.
 
అయితే సమంతను తెలంగాణ రాష్ట్ర చేనేత బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించలేదని , అసలు ఆమెకు ప్రభుత్వం తరఫున పైసా కూడా ఇవ్వలేదని అప్పట్లోని కేసీఆర్ సర్కారు బదులిచ్చారు.