సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 6 సెప్టెంబరు 2019 (17:30 IST)

సమంత వీపు మీద ట్యాటూ.. బీచ్ ఫోటోలు వైరల్

అక్కినేని నాగార్జున కోడలు సమంత ప్రస్తుతం తమిళ రీమేక్ 96లో నటిస్తోంది. ప్రస్తుతం స్పెయిన్‌లో నాగార్జున బర్త్ డే సెలెబ్రేషన్స్‌లో ఎంజాయ్ చేస్తోంది. ఈ ట్రిప్పుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా విహారయాత్ర ముగించుకొని తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు.అయితే ట్రిప్ ముగిసిన తర్వాత సమంత పలు ఫోటోలను షేర్ చేసింది. 
 
అక్కినేని కుటుంబ సభ్యులందరితో కలిసి దిగిన ఫోటోను పెట్టి 'అందమైన జ్ఞాపకాలకు ధన్యవాదాలు' అని పేర్కొంది. దీంతో పాటు బ్లాక్ డ్రెస్ తో మ్యాచింగ్ మెటాలిక్ బెలూన్ పట్టుకొని వయ్యారంగా పోజ్ ఇచ్చిన ఒక ఫోటోను షేర్ చేసింది. 
 
అంతేగాకుండా.. స్పెయిన్‌లోని ఐబిజా ఐలాండ్‌లో సమంత ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు కూడా సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అందులోని ఓ ఫోటోలో సమంత వీపుపై ఓ అందమైన ట్యాటూ ఉంది. సమంత వీపు మీద లవ్ అనే ట్యాటూ వుంది. ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.