శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 7 మార్చి 2020 (15:00 IST)

సమంత @ 100కేజీలు

'ఏ మాయ చేశావే' సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టిన సమంత దక్షిణాది టాప్‌ హీరోయిన్లలో ఒకరిగా నిలిచింది. పెళ్లయిన తర్వాత కూడా ఆమె జోరు తగ్గలేదు. ఇటీవలే ఆమె నటించిన జాను సినిమా విడుదలైంది. జాను సినిమా తర్వాత సమంత కాస్త బ్రేక్ తీసుకుంది. 
 
తాజాగా ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యత నిచ్చే సమంత జిమ్‌లో వ్యాయామాలు చేస్తుంది. తాజాగా వంద కిలోల బరువున్న బార్బెల్‌ను సులువుగా ఎత్తిపారేసింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. గతంలోనూ ఈ అమ్మడు ఇలా బరువైన బార్బెల్స్‌ ఎత్తుతూ పలుసార్లు వీడియో తీసుకుంది.
 
సమంత జిమ్‌లో 100 కిలోల బరువును ఎత్తిన విషయంపై నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు. 'వామ్మో సమంతా' అంటూ రిప్లై ఇస్తున్నారు. ఇంత బరువు ఎలా ఎత్తావని అడుగుతున్నారు.