మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 27 ఫిబ్రవరి 2020 (16:15 IST)

ఇప్పుడిప్పుడే టాలీవుడ్‌కు జాన్వీ ఎంట్రీ వుండదట..!

అలనాటి టాప్ హీరోయిన్ శ్రీదేవి కూతురిగా సినీ ఇండస్ట్రీకి పరిచయమైన జాన్వీ కపూర్ సొంతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటోంది. మొదటి సినిమా ధఢక్‌తో మంచి పేరు తెచ్చుకుంది. ఈ సినిమా భారీ విజయం సొంతం చేసుకుంది. ఇప్పుడు జాన్వీ చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి.
 
ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు తనదైన శైలిలో ఫోటో షూట్‌లు చేస్తూ బాలీవుడ్ ప్రేక్షకులకు మరింత దగ్గరవుతోంది. అయితే, శ్రీదేవి కోరిక మాత్రం ఇంకా తీరలేదని చెప్పాలి. ఎందుకంటే, జాన్వీని తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేయడమే ఆమె కోరిక. 
 
కానీ, ఆ కోరిక తీరకుండానే ఆమె కన్నుమూసింది. విజయ్ దేవరకొండ ఫైటర్ సినిమాలో జాన్వీ చేస్తుందని అనుకున్నారు. ఎందుకంటే ఫైటర్ సినిమాను బాలీవుడ్‌లో కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. దీంతో ఆ సినిమాలో జాన్వీ నటిస్తుందనుకున్నారు. కానీ డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఆ సినిమా చేజారిపోయింది.
 
ఇంకా విజయ్ దేవరకొండ సినిమాలు ప్రస్తుతం ఫ్లాప్ కావడంతో జాన్వీని అతనితో నటింపజేసేందుకు నిర్మాతలు ఆచితూచి వ్యవహరిస్తున్నారట. అయినా ఆమె ప్రస్తుతానికి అంత సులభంగా తెలుగు ఇండస్ట్రీకి రాదని.. ఆమె చేతిలో చాలా సినీ అవకాశాలున్నాయని సినీ పండితులు చెప్తున్నారు.