సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శనివారం, 7 అక్టోబరు 2017 (16:08 IST)

సమంత, నాగచైతన్య వెడ్డింగ్ సాంగ్ చూడండి (వీడియో)

చెన్నై బ్యూటీ సమంత అక్కినేని వారింటి కోడలైంది. తన ప్రేమికుడు అక్కినేని నాగ చైతన్యను పెళ్లాడిన సమంతకు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా వుండే సమంత.. పెళ్

చెన్నై బ్యూటీ సమంత అక్కినేని వారింటి కోడలైంది. తన ప్రేమికుడు అక్కినేని నాగ చైతన్యను పెళ్లాడిన సమంతకు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా వుండే సమంత.. పెళ్లి పనుల్లో బిజీగా వున్నప్పటికీ ప్రతి మూమెంట్స్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోల ద్వారా షేర్ చేసుకుంటోంది.
 
గోవాలోని వాగటర్ బీచ్‌లో తెలుగు సంప్రదాయం ప్రకారం సమంత, చైతూల వివాహం జరిగిన నేపథ్యంలో.. క్రైస్తవ సంప్రదాయం  ప్రకారం శనివారం సాయంత్రం జరుగనుంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో నాగచైతన్య, సమంత వెడ్డింగ్ సాంగ్ వైరల్ అవుతోంది. ఇప్పటికే 862,163 వ్యూస్ లభించిన ఈ పాటను వీడియో ద్వారా చూడండి. ఈ పాటను శ్రావణ భార్గవి, రేవంత్ పాడారు.