ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 18 నవంబరు 2021 (11:36 IST)

కేటీఆర్‌‌పై సమంత పోస్ట్... సోషల్ మీడియాలో వైరల్

నాగచైతన్యతో విడాకులు తీసుకోవడం, టీవీ ఛానెల్స్‌పై కోర్టు మెట్లెక్కడం తదితర విషయాలతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఉంది సమంత. అభిమానులు, నెటిజన్లు నిరంతరం ఆమె సోషల్‌ మీడియా ఖాతాలను చెక్‌ చేస్తున్నారు . ఈ క్రమంలో తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశించి ఈ ముద్దుగుమ్మ పెట్టిన ఓ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 
 
అదేంటంటే.. ఆపదలో ఉన్న చిన్నారులు, పిల్లలను ఆదుకోవడం కోసం తెలంగాణ ప్రభుత్వం ఇటీవల బాలరక్షక్‌ వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. జిల్లాకొకటి చొప్పున మొత్తం 33 బాల రక్షక్‌ వాహనాలను మంగళవారం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ ప్రారంభించారు. 1098 టోల్‌ ఫ్రీ నంబర్‌కు డయల్‌ చేస్తే వెంటనే బాల రక్షక్‌ వాహనాలు వచ్చేలా ఏర్పాట్లు చేశారు.
 
ఈ క్రమంలో మంత్రి సత్యవతిని, ఆమె ప్రారంభించిన పథకాన్ని ప్రశంసిస్తూ మంత్రి కేటీఆర్‌ సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టాడు. మంత్రి సత్యవతి గొప్ప నిర్ణయం తీసుకుందని అభినందించారు. మంత్రి కేటీఆర్‌ చేసిన ఈ పోస్ట్‌ను బుధవారం సమంత సోషల్‌ మీడియాలో పంచుకుంది. తన ఇన్‌స్టా స్టోరీలో పెట్టి, దండం పెడుతూ చప‍్పట్లు కొడుతున్న ఎమోజీలను షేర్ చేసింది. ఇక విడాకుల తర్వాత వరుస సినిమాలను అంగీకరిస్తోంది సమంత. 
 
గుణశేఖర్‌ దర్శకత్వంలో ఆమె నటించిన 'శాకుంతలం' త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళంలో విజయ్‌ సేతుపతి, నయనతారలతో కలిసి నటిస్తోన్న 'కాత్తు వాక్కుల రెండు కాదల్‌' కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. 
 
వీటితో పాటు డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ నిర్మిస్తోన్న 30వ చిత్రానికి ఇటీవలే సమంత సంతకం చేసింది. హీరోయిన్‌గానే కాదు 'పుష్ప' సినిమాలో స్పెషల్‌ సాంగ్‌ చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ కూడా ఇచ్చింది. ఇందుకోసం భారీ పారితోషకం తీసుకుంటోందనే వార్తలు వినిపిస్తున్నాయి.