శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 17 నవంబరు 2021 (12:57 IST)

గగనతలంలో విమాన ప్రయాణికుడి కేంద్ర మంత్రి వైద్యం - ప్రధాని మోడీ ప్రశంసలు

కేంద్ర మంత్రి ప్రయాణికుడి కేంద్ర మంత్రి ఒకరు చికిత్స చేశారు. వృత్తి రీత్యా డాక్ట‌ర్ అయిన ఓ కేంద్ర మంత్రి తోటి ప్ర‌యాణికుడికి స‌కాలంలో చికిత్స అందించి ప్రాణాలు కాపాడాడు. స‌ద‌రు కేంద్ర మంత్రిపై ప్ర‌ధానమంత్రి నరేంద్ర మోడీ ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. 
 
ఈ వివరాలను పరిసీలిస్తే, మంగళవారం రాత్రి కేంద్ర ఆర్థిక స‌హాయ మంత్రి డాక్ట‌ర్ భ‌గ‌వ‌త్ క‌రాడ్ ఢిల్లీ నుంచి ముంబైకి ఇండిగో విమానంలో బ‌య‌ల్దేరారు. త‌న ప‌క్క‌నే ఉన్న ఓ ప్ర‌యాణికుడు స్వ‌ల్ప అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యాడు. త‌ల‌నొప్పిగా ఉంద‌ని తెలిపాడు. బీపీ లెవ‌ల్స్ కూడా పడిపోయాయి. 
 
దీంతో అస్వ‌స్థ‌త‌కు గురైన ప్ర‌యాణికుడిని కేంద్ర మంత్రి గ‌మ‌నించి త‌క్ష‌ణ‌మే వైద్యం అందించాడు. గ్లూకోజ్ అందించడంతో స‌ద‌రు ప్ర‌యాణికుడు త్వ‌ర‌గా కోలుకున్నాడు. దీంతో ఇండిగో యాజ‌మాన్యం కేంద్ర మంత్రికి ధ‌న్య‌వాదాలు తెలుపుతూ ట్వీట్ చేసింది. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ కూడా కేంద్ర మంత్రి డాక్ట‌ర్ భ‌గ‌వ‌త్ క‌రాడ్‌పై ప్ర‌శంస‌లు కురిపించారు.