మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : ఆదివారం, 5 మార్చి 2017 (15:06 IST)

సినిమాల్లో నటిస్తానంటే నా కుమార్తె కాళ్లు విరగ్గొడతా : సంజయ్ దత్

తన కుమార్తెకు బాలీవుడ్ హీరో సంజయ్ దత్ ఘాటైన హెచ్చరిక చేశారు. సినిమాల్లో నటిస్తానని ప్రతిపాదన తెస్తే కాళ్లు విరగ్గొట్టి ఇంట్లో కూర్చోబెడతానంటూ వార్నింగ్ ఇచ్చాడు. ముంబై బాంబు పేలుళ్ల కేసులో అక్రమగా ఆయుధ

తన కుమార్తెకు బాలీవుడ్ హీరో సంజయ్ దత్ ఘాటైన హెచ్చరిక చేశారు. సినిమాల్లో నటిస్తానని ప్రతిపాదన తెస్తే కాళ్లు విరగ్గొట్టి ఇంట్లో కూర్చోబెడతానంటూ వార్నింగ్ ఇచ్చాడు. ముంబై బాంబు పేలుళ్ల కేసులో అక్రమగా ఆయుధం కలిగివున్నందుకు జైలు శిక్షను అనుభవించి, సుప్రీంకోర్టు అనుమతితో విడుదలైన ఈ బాలీవుడ్ హీరో... ప్రస్తుతం ‘భూమి’ చిత్రం షూటింగ్‌లో బిజీబిజీగా ఉన్నారు. 
 
తన‌కు ఎదుర‌యిన క‌ష్టాలు త‌న పిల్ల‌ల‌కు ఉండ‌కూడ‌ద‌ని ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ వారిపై ఆంక్ష‌లు విధిస్తున్నాడు. తండ్రీకూతుళ్ల మధ్య అనుబంధం నేపథ్యంలో తెరకెక్కుతున్న త‌న‌ సినిమా గురించి ఇంట‌ర్వ్యూ ఇచ్చిన సంజ‌య్ ద‌త్ చిత్రంలో తన కూతురి పాత్ర గురించి, నిజజీవితంలో తన కూతురి త్రిశల గురించి మాట్లాడాడు. 
 
'మా త్రిశల నటి కావాలని కలలు కంటోంది. కానీ నేను తన కాళ్లు విరగ్గొడదాం అనుకుంటున్నా' అని సంజయ్ వ్యాఖ్యానించాడు. త‌న కూతురి చదువు కోసం ఎంతో సమయం, శక్తి కేటాయించాన‌ని ఆయ‌న చెప్పాడు. ఆమెని ఫోరెన్సిక్ సైన్స్ చదివించాలని అనుకుంటున్నట్టు చెప్పుకొచ్చాడు.