శనివారం, 18 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్

'సంక్రాంతికి వస్తున్నాం' - 3 రోజుల్లోనే రూ.106 కోట్లు వసూళ్లు!!

sankrantiki vastunnam
విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం'. సంక్రాంతి కానుకగా మంగళవారం విడుదలైంది. ఈ సినిమా తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఫలితంగా భారీ వసూళ్ళు సాధిస్తుంది.
 
క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ కావడం పైగా సంక్రాంతి పండగ సీజన్‌కు రావడంతో సినిమా భారీ కలెక్షన్లను రాబడుతుంది. ఈ మూవీ మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.106 కోట్ల గ్రాస్ వసూళ్ళు చేసినట్టు మేకర్స్ ప్రకటించారు. 
 
"ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్.. విక్టరీ వెంకటేష్" అంటూ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. దీంతో వెంకీమామ అభిమానులు తమ హీరోను పొగుడుతూ సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతున్నారు. కాగా, ఈ చిత్రానికి తొలి రోజున వరల్డ్‌గా రూ.45 కోట్ల గ్రాస్‌ను వసూలు, రెండు రోజుల్లోరూ.77 కోట్లకు చేరుకోగా, ఇపుడు మూడు రోజుల్లోరూ.106 కోట్ల మేరకు వసూలు చేసింది.
 
ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శరీష్ కలిసి నిర్మించిన ఈ సినిమాకు భీమ్స్ అద్భుతమైన బాణీలను అందించారు. మూవీ ఆల్పబ్‌లోని దాదాపు అన్ని పాటలు సూపర్ హిట్‌గా నిలిచాయి. వెంకీ సరసన ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయన్లుగా నటించారు. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకుడు.