ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Updated : మంగళవారం, 14 మార్చి 2017 (20:44 IST)

సినీ నటి జయసుధ భర్త నితిన్ కపూర్ ఆత్మహత్య... డిప్రెషనే కారణం...

సినీ నటి జయసుధ భర్త నితిన్ కపూర్ ముంబైలోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన తన స్వగృహంలోనే ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన మృతికి కారణం తీవ్రమైన మానసిక ఒత్తిడేనని చెపుతున్నారు. గత ఏడాదిన్నరగా ఆయన ఒత్తిడికి గురై దానికి చికిత్స కూడా తీసుకుంటున్నట్లు

సినీ నటి జయసుధ భర్త నితిన్ కపూర్ ముంబైలోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన తన స్వగృహంలోనే ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన మృతికి కారణం తీవ్రమైన మానసిక ఒత్తిడేనని చెపుతున్నారు. గత ఏడాదిన్నరగా ఆయన ఒత్తిడికి గురై దానికి చికిత్స కూడా తీసుకుంటున్నట్లు సమాచారం. కాగా కపూర్ మరణ వార్త విన్నవెంటనే జయసుధ హైదరాబాద్ నుంచి ముంబై బయలుదేరి వెళ్లారు.
 
1985లో జయసుధను నితిన్ కపూర్ ప్రేమ వివాహం చేసుకున్నారు. నితిన్ కపూర్ ప్రముఖ బాలీవుడ్ నటుడు జితేంద్రకు వరసకు సోదరుడు. అప్పట్లో తనకు దర్శకత్వంపై ఇష్టం వుందని జితేంద్రకు చెప్పడంతో ఆయన నితిన్ కపూర్‌ను దాసరి నారాయణరావు వద్ద అసిస్టెంట్ డైరెక్టరుగా చేర్పించారు. ఆ సమయంలోనే జయసుధను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు నితిన్ కపూర్. 
 
నితిన్ కపూర్ కలుపుగోలుగా వుండే వ్యక్తనీ, ఆయన మరణం తమను షాక్ కు గురి చేసిందని టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ పేర్కొంది. కాగా నితిన్ కపూర్ జేఎస్కే కంబైన్స్ బ్యానర్ స్థాపించి ఎన్నో చిత్రాలు నిర్మించారు.