గురువారం, 28 సెప్టెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 31 మార్చి 2023 (18:01 IST)

సమంత 'శాకుంతలం' నుంచి 'మల్లికా మల్లికా మాలతీ మాలిక' సాంగ్ రిలీజ్

samantha
స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం "శాకుంతలం". ఏప్రిల్ 14వ తేదీన విడుదల కానుంది. ఇందులోభాగంగా, ఈ చిత్రం నుంచి తాజాగా వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. "మల్లికా మల్లికా.. మాలతీ మాలిక... చూడవా చూడవా ఏదే నా ఏలికా" అంటూ ఈ పాట సాగుతుంది. చైతన్య ప్రసాద్ గేయ రచన చేయగా, మణిశర్మ సంగీతం స్వరపరిచారు. రమ్య బెహ్రా ఆలరించగా, గుణశేఖర్ అద్భుతంగా పాటను చిత్రీకరించారు. 
 
దుష్యంతుడి కోసం ఎదురు చూస్తూ శకుంతల పాడుకునే పాట ఇది తెరపైకి రానుంది. దుష్యంతుడిగా దేవ్ మోహన్ ఈ చిత్రంలో నటించగా, మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, గౌతమిలు ముఖ్య పాత్రలను పోషించారు. పాన్ ఇండియా స్థాయిలో నిర్మితమైన ఈ సినిమా కొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందన్న నమ్మకంతో చిత్ర బృందం ఉంది.