సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 17 జనవరి 2017 (12:57 IST)

గేయ రచయిత సాహిర్‌ లూధియాన్వి బయోపిక్... ఐష్-షారూఖ్ జంటగా నటిస్తారట..

బాలీవుడ్‌లో హిట్ పెయిర్‌గా పేరున్న షారూఖ్ ఖాన్-ఐశ్వర్యారాయ్ జంట మళ్లీ చాలా గ్యాప్ తర్వాత తెరపై కనిపించబోతోంది. ప్రముఖ దర్శకుడు సంజయలీలా బన్సాలీతో ఐష్-షారూఖ్‌ల సినిమా ఉంటుందని తెలుస్తోంది. దివంగత హిందీ

బాలీవుడ్‌లో హిట్ పెయిర్‌గా పేరున్న షారూఖ్ ఖాన్-ఐశ్వర్యారాయ్ జంట మళ్లీ చాలా గ్యాప్ తర్వాత తెరపై కనిపించబోతోంది. ప్రముఖ దర్శకుడు సంజయలీలా బన్సాలీతో ఐష్-షారూఖ్‌ల సినిమా ఉంటుందని తెలుస్తోంది. దివంగత హిందీ చలనచిత్ర గేయ రచయిత సాహిర్‌ లూధియాన్వి జీవిత చరిత్ర ఆధారంగా సంజయ్‌ ఈ సినిమా నిర్మిస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ ప్రాజెక్టు సఫలమైతే షారుక్‌ఖాన్‌ సాహిర్‌ లూధియాన్విగా, ఐశ్వర్యరాయ్‌ బచన్‌ పంజాబి కవయిత్రి అమృతా ప్రీతంగా నటించే అవకాశం ఉంది. 
 
ఆ రోజుల్లో సాహిర్‌ – అమృతాల మధ్య విడదీయని ప్రేమానుబంధం ఉండేదని బలీయమైన వార్త చలామణిలో ఉండేది. సంజయ లీలా బన్సాలి నిర్మించబోయే సినిమాకి ‘గుస్తాఖియాన్‌’ అని నామకరణం కూడా జరిగినట్లు తెలుస్తున్నది. ఇందులో ముఖ్యంగా సాహిర్‌ రచించిన గజళ్లు, నజ్మ్‌ వంటి ఉర్దూ కవితలు ఉంటాయట. అయితే ఈ సినిమా గురించి ఐశ్వర్యారాయ్‌తో నోరు విప్పలేదు. ప్రస్తుతం బాలీవుడ్‌లో బయోపిక్‌ల పర్వం జరుగుతున్న సంగతి తెలిసిందే.