టాలీవుడ్‌లోనే అతి పెద్ద అబద్దాల కోరు ఈమేనట..!
బాహుబలి, బజరంగి బాయిజాన్ సినిమాల సూపర్ సక్సెస్‌తో ఆ రెండు సినిమాల రచయిత విజయేంద్ర ప్రసాద్ ఒక్కరాత్రిలో సంచలన కథకుడిగా మారిపోయారు. ప్రస్తుతం తాను శ్రీవల్లి అనే థ్రిల్లర్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నార
బాహుబలి, బజరంగి బాయిజాన్ సినిమాల సూపర్ సక్సెస్‌తో ఆ రెండు సినిమాల రచయిత విజయేంద్ర ప్రసాద్ ఒక్కరాత్రిలో సంచలన కథకుడిగా మారిపోయారు. ప్రస్తుతం తాను శ్రీవల్లి అనే థ్రిల్లర్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. గత రాత్రి ఈ సినిమా ఆడియో ప్రారంభోత్సవం జరిపారు. ఆ సందర్భంగా విజయేంద్రప్రసాద్ అత్యంత ఆసక్తికరమైన ప్రసంగం చేసారు.
టాలీవుడ్‌లోనే అతిపెద్ద అబద్దాల కోరు ఎవరు అని ప్రశ్నిస్తూ ఆయన తన ప్రసంగాన్ని ప్రారంభించారు. తర్వాత ఆ అబద్దాల కోరు యాంకర్ సుమే అని చెప్పారు. ఎందుకంటే ప్రతి సినిమా ఆడియో ఫంక్షన్‌కూ వచ్చి ఆ సినిమా అతి పెద్ద హిట్ అవుతుందని ఆమె అబద్దం చెబుతుందనేశారు. అభిమానులే కాకుండా పలువురు బయ్యర్లు కూడా ఆమె అబద్దాలు నమ్మేసి ఆ సినిమాలను కొనేస్తారని చెప్పారు.
అయితే తాను మాత్రం అబద్దాలు నమ్మనని, సత్యం మాత్రమే చెబుతానని, భారతీయ సినీ చరిత్రలో శ్రీవల్లి వంటి కథాచిత్రం రాలేదని గర్వంగా చెబుతున్నానని, ఇది ప్రతి ఒక్కరినీ ఇంప్రెస్ చేస్తుందని విజయేంద్ర ప్రసాద్ చెప్పారు.
తన కుమారుడు రాజమౌళి పేరు చెప్పుకుని ఈ సినిమాను సులభంగా అమ్ముకునేవాడినని అయితే ఈ సినిమా దాని గొప్పదనంతోనే ఆడాలని, ప్రేక్షకులు దానిని అస్వాదించాలని విజయేంద్రప్రసాద్ పేర్కొన్నారు. చాలావరకు కొత్తవారే నటించిన ఈ చిత్రం ఎమ్ఎమ్ కీరవాణి సోదరి ఎమ్ఎమ్ శ్రీలేఖ సంగీత దర్శకత్వం వహించారు. ఇది అతి త్వరలోనే విడుదల కానుంది.