1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 26 ఏప్రియల్ 2016 (18:01 IST)

రకుల్ ఖాతాలో లేని హిట్టు.. కోటిని దాటని రెమ్యునరేషన్.. బెల్లం కొండ శీనుతో లక్.. ఎలా?

ఢిల్లీ నుంచి టాలీవుడ్‌కు దిగుమతి అయిన రకుల్ ప్రీత్ సింగ్ చిన్న హీరోల నుంచి పెద్ద హీరోల సరసన నటించినా ఆమెకు అగ్ర హీరోయిన్ అనే ఇమేజ్ ఇంకా వరించలేదు. ఇందుకు కారణం ఆమె ఖాతాలో ఓ సూపర్ హిట్ కూడా లేకపోవడమే. తాజాగా సరైనోడులో అల్లు అర్జున్ సరసన నటించిన రకుల్ ప్రీత్ సింగ్.. ఆ సినిమా నెగటివ్ టాక్‌ను సొంతం చేసుకోవడంతో ఆమె ఖాతాలో హిట్ కనుమరుగైపోయింది. 
 
బ్రూస్ లీ ఫట్ తర్వాత మెగా హీరోతో నటించిన సరైనోడు ఫ్లాప్ కావడంతో ఆమెకు రెమ్యునరేష్ పెరగట్లేదు. రకుల్ ప్రీత్ సింగ్ ఒక్క సినిమా కూడా బ్లాక్ బస్టర్ కాకపోవడంతో రకుల్ ప్రీత్ సింగ్ పారితోషికం లక్షల్లో ఉందని టాక్ వస్తోంది. అయితే ఇక రకుల్ ప్రీత్ సింగ్ రేటు పెరగనుందని సినీ పండితులు అంటున్నారు. అదెలాగంటే.. యంగ్ హీరో బెల్లం కొండ శీను రకుల్ ప్రీత్ సింగ్‌కు భారీ మొత్తాన్ని పారితోషికంగా ఇచ్చుకున్నాడని తెలిసింది. 
 
బెల్లం కొండ సురేష్ ఎప్పటి నుంచో బోయపాటి శీను దర్శకత్వంలో సినిమా చేయాలనుకుంటున్నారు. ప్రస్తుతం ఆ సినిమాకు సర్వం సిద్ధమని.. ఈ మూవీలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా ఎంపికైనట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలొస్తున్నాయి. ఈ సినిమాకు గాను రకుల్ ప్రీత్ సింగ్ రూ.1.50 కోట్ల పారితోషికాన్ని పుచ్చుకోనున్నట్లు తెలిసింది. ఇక మరో ట్విస్ట్ ఏమిటంటే ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న బోయపాటి శ్రీనుకు ఏకంగా రూ.12 కోట్లు భారీ పారితోషికం బెల్లం సురేష్ ఆఫర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా బడ్జెట్ ఎంతో తెలుసుకోవాలంటే.. వెయిట్ చేయాల్సిందే.!