బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 16 జనవరి 2021 (17:03 IST)

టైలర్‌గా మారిన సోనూ సూద్.. కానీ కస్టమర్ దుస్తులకు గ్యారంటీ లేదు..

సినిమాలో విలన్‌గానూ నిజ జీవితంలో రియల్ హీరోగా మారిన నటుడు సోనూసూద్.. టైలర్‌గా అవతారం ఎత్తాడు. సినిమాలతోనే గాక సోషల్ మీడియా ద్వారా కూడా ఫ్యాన్స్​తో టచ్‌లో వుంటున్న సోనూసూద్.. తాజాగా ఓ ఫన్నీ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్‌చేశారు. ఆ వీడియోలో సోనూసూద్ టైలర్​ అవతారమెత్తారు. ప్యాంట్ కుట్టేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు.
 
ఇటీవల ఆచార్య సినిమా షూటింగ్‌లో పాల్గొన్న సోనూసూద్‌.. లొకేషన్​లో ఉన్న ఓ క్లాత్ తీసుకొని ప్యాంట్​ కుట్టేందుకు ప్రయత్నించారు. అయితే అది అనుకున్నట్టు రాకపోవడంతో ఫన్నీ కామెంట్​తో ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టారు. 
 
'సోనూసూద్ టైలరింగ్ షాప్. ఇక్కడ దుస్తులు ఉచితంగా కుడతాం. అయితే ప్యాంట్‌లు నిక్కర్లు అవుతాయేమో.. ఆ విషయంలో గ్యారెంటీ లేదు' అని సోనూసూద్ రాసుకొచ్చారు. కాగా, ఈ వీడియోకు లక్షల్లో వ్యూస్, లైకులు, కామెంట్లు వస్తూనే ఉన్నాయి. కస్టమర్ దుస్తులకు నో గ్యారంటీ అంటూ పోస్టు చేయడంతో లైకులు, షేర్లు, కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.