బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 7 జనవరి 2021 (14:54 IST)

సోనూసూద్‌ దంపతులపై పోలీసులకు ఫిర్యాదు..

కరోనా సమయంలో ఎంతో మందికి అండగా నిలిచి రియల్‌ హీరో అనిపించుకున్న ప్రముఖ సినీ నటుడు సోనూసూద్‌కు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు షాక్ ఇచ్చారు. సోనూసూద్, అతని భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముంబై నగరంలోని తన నివాస గృహాన్ని హోటల్‌గా మార్చినందుకు సోనూసూద్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని బీఎంసీ అధికారులు ముంబై పోలీసులను కోరారు. 
 
అవసరమైన అనుమతి తీసుకోకుండా తన నివాస భవనాన్ని సోనూసూద్ హోటల్‌గా మార్చారని బీఎంసీ ఆరోపించింది. ఈ విషయంలో బీఎంసీ అధికారులు సోనూసూద్ కు పలు నోటీసులు పంపినప్పటికీ స్పందించలేదని, అందుకే తాము పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని బీఎంసీ అధికారులు చెప్పారు. 
 
ఒక భవనాన్ని అక్రమంగా అభివృద్ధి చేశారని, ఆరోపిస్తూ నటుడు సోనుసూద్, అతని భార్య సోనాలి సూద్‌లపై బీఎంసీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోనూసూద్‌ జుహూలోని శక్తిసాగర్ అనే భవనంలో నివాసం ఉంటున్నారు. ఆరు అంతస్తుల నివాస భవనాన్ని హోటల్‌గా మార్చారని దీనికి సరైన అనుమతి లేదని బీఎంసీ ఆరోపిస్తోంది.