గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 30 డిశెంబరు 2020 (11:49 IST)

సోనూ సూద్ కొత్త అవతారం.. ఏంటంటే?

బాలీవుడ్ హీరో సోనూ సూద్ కొత్త అవతారం ఎత్తారు. కరోనా కష్టకాలంలో దేవుడుగా మారాడు సోనూ సూద్. వలస కూలీలను తమ ఇళ్ల స్థలాలకు చేర్చి, అలాగే పలు విధాలుగా నష్టపోయిన వారికి ఆసరాగా ఉంటూ వాళ్ళని ఆదుకుంటూ రియల్ హీరో అయ్యాడు. ఇంకా పేద వాళ్లకి సహాయం చేస్తున్నాడు. ఇదిలా ఉంటే.. విలన్ క్యారెక్టర్లు చేస్తూ బాగా పాపులర్ అయ్యాడు. 
 
ముఖ్యంగా అరుంధతి సినిమాలో ఇతను పోషించిన పశుపతి పాత్ర అయితే ఇప్పటికి ఎవరు మరిచిపోలేరు. అయితే ఈ మధ్యకాలంలో సోనూకి అవకాశాలు తగ్గాయి. ఇప్పుడు మరోసారి సోనూని తీసుకురావాలని నిర్మాతలు అనుకుంటున్నారు.
 
ప్రస్తుతం సోనూసూద్.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తోన్న సినిమాలో నటిస్తున్నాడు. తాజాగా సోనూసూద్‌ తన భవిష్యత్తు కెరీర్‌పై కీలక ప్రకటన చేశాడు. తాను త్వరలోనే సినిమా నిర్మాణంలోకి అడుగుపెట్టనున్నట్లు పేర్కొన్నాడు సోనూ. 
 
"నేనే నిర్మాతగా మారబోతున్నా. చర్చలు చివరి దశలో ఉన్నాయి. ప్రజల్లో స్ఫూర్తి నింపే కథలు, నేను చేయాలనుకున్న స్క్రిఫ్ట్స్ కోసం చూస్తున్నా. అన్నీ కుదిరితే నటుడిగా, నిర్మాతగా మీ ముందుకొస్తా" అని స్వయంగా సోనూ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.