శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : బుధవారం, 14 ఏప్రియల్ 2021 (17:12 IST)

స‌న్న‌టి తుంప‌ర‌లో సైకిల్ పై ఆచార్య సెట్‌కు సోనూసూద్

Sonusood bycle
ఒక ప‌క్క స‌న్న‌టి తుంప‌ర‌, మ‌రోవైపు చ‌ల్ల‌టి గాలి, పొద్దున్నే ఇలాంటి వాతావ‌ర‌ణంలో సైకిల్‌పై వెళితే ఎలావుంటుంది. ప్రకృతి ప్రేమికుడిగా సైకిల్‌పై వ్యాయామం చేస్తూ ఎంజాయ్ చేశాడు సోనూసూద్‌. ఆయ‌న్ను అనుస‌రిస్తూ ఆయ‌న కారు వెన్నంటే వుంది. ఇది హైద‌రాబాద్‌లోని ఎర్నీ మార్నింగ్‌లో వంతెన‌పై సోనూసూద్ సంద‌డి. 
 
మగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఆచార్యలో సోనుసూద్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ లొకేషన్ కు సోనుసూద్ సైకిల్ మీద వెళ్లడం విశేషం. సోనూసూద్ కి సైక్లింగ్ అంటే చాలా ఇష్టం. పైగా ఉద‌యాన్నే సెట్ కి వెళ్లాల్సిన అవ‌స‌రం వ‌చ్చింది. అందుకే సైకిల్ ఎక్కాడు. అటు వ్యాయామం, ఇటు.. ప్ర‌యాణం రెండూ క‌లిసొచ్చేశాయి.
 
Sonusood bycle
మొన్న తమిళనాడు ఎన్నికల సమయంలో స్టార్ హీరో విజయ్ ఓటు వేయడానికి సైకిల్ మీద వెళ్ళడం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారిపోయింది. తాజాగా అదే ఫీట్ ను ఇప్పుడు ప్రముఖ నటుడు సోనూసూద్ చేశాడు. హైద‌రాబాద్‌లోని దుర్గం చెరువు మీద క‌ట్టిన ఊగేఊయ‌ల బ్రిడ్జిపై నుంచి ఆయ‌న పొద్దునే వెళ్లుతూ ప్ర‌కృతిని ఎంజాయ్ చేశారు. రాత్రే హైద‌రాబాద్ అంతా గాలి, వాన‌తో ఒక్క‌సారిగా వాతావ‌ర‌ణం మారిపోరింది. పొద్దునే స‌న్న‌టితుంప‌ర‌ల‌తో క‌మ్మిన‌ట్లున్న వాతావ‌ర‌ణాన్ని ఎంజాయ్ చేస్తూ సైకిల్ తొక్కారు. గొప్ప థ్రిల్ క‌లిగించింద‌ని ఆయ‌న పేర్కొన్నారు.