బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 2 ఏప్రియల్ 2021 (20:15 IST)

40 గ్రామాలకు చెందిన 300 మంది పేద విద్యార్థులకు ఫోన్లు.. సోనూ సూద్

బాలీవుడ్ స్టార్ సోనూ సూద్ సేవలు కొనసాగుతూనే వున్నాయి. కరోనా కష్టకాలంలో పేదల పాలిట ఆపద్భాంధవుడిగా మారిన సోనూసూద్.. ఆపై పేదలకు సేవలు చేస్తూనే వున్నాడు. తాజాగా పేద విద్యార్థులకు చేయూతనిచ్చారు. 
 
కరోనా కారణంగా స్కూళ్లు మూతపడి విద్యార్థులు ఆన్‌లైన్‌ క్లాస్‌లకే పరిమితమయ్యారు. దీంతో ఎంతో మంది పేద విద్యార్థులు స్మార్ట్‌ ఫోన్లు లేక పాఠాలకు దూరమవుతున్నారు. అలాంటిని వారి గురించి ఏ రాష్ట్రాల ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. విద్యార్థులు పాఠాలను వినేందుకు ఎలాంటి దారి లేకుండా ఇబ్బందులకు గురవుతున్నారు. 
 
అలాంటి వారికి సోనూ సాయం చేశారు. ఇందులో భాగంగా లక్నోలో సమీప గ్రామాల్లోని పేద విద్యార్థినిలకు స్మార్ట్‌ ఫోన్లు అందజేశారు. 40 గ్రామాలకు చెందిన దాదాపు 300 మంది పేద విద్యార్థినులకు ఆయన మొబైల్‌ ఫోన్లు పంపిణీ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సందర్భంగా సోనూను అభినందిస్తూ నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.