మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 27 మార్చి 2021 (12:21 IST)

ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ క్యాంపస్‌లో 53 మందికి కరోనా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ఒక్కసారికా కట్ట తెంచుకున్నట్టుగా తెలుస్తోంది. గత వారం రోజులుగా కొత్తగా నమోదయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో తాజాగా విశాఖపట్టణంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం ఇంజనీరంగ్ కాలేజీ క్యాంపస్‌లో 53 మంది సిబ్బందితో పాటు.. విద్యార్థులకు కరోనా వైరస్ సోకింది. దీంతో క్యాంపస్‌లోని విద్యార్థులను ఐసోలేషన్‌లో ఉంచారు. 
 
అంతేకాకుండా, క్యాంపస్‌లో ఉన్న మిగిలిన విద్యార్థులకు కూడా కరోనా నిర్ధారణ పరీక్షలను ఆరోగ్య శాఖ అధికారులు చేస్తున్నారు. ఇదిలావుంటే, క్యాంపస్‌లో కరోనా వైరస్ కేసులు ఎక్కువ కావడంతో ప్రస్తుతం జరుగుతున్న పరీక్షలను వాయిదావేయాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.