మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : బుధవారం, 9 జనవరి 2019 (09:32 IST)

మళ్లీ పెళ్లిపీటలపై కూర్చోనున్న రజనీ కుమార్తె సౌందర్య

సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ చిన్న కుమార్తె సౌందర్య రెండో పెళ్లి చేసుకోనుంది. గతంలో నగరానికి చెందిన యువ పారిశ్రామికవేత్తను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత వారిద్దరి మధ్య ఏర్పడిన మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఇపుడు మళ్లీ రెండో పెళ్లి చేసుకోనుంది. కోయంబత్తూరుకు చెందిన ఓ పారిశ్రామికవేత్త కుమారుడుతో ఆమె పెళ్లి జరుగనుంది. ఈ వివాహం మాత్రం ఇరు కుటుంబాల మధ్యే నిర్వహించనున్నారు. ఇప్పటికే నిశ్చితార్థం ముగియగా, పెళ్లి మాత్రం వచ్చే నెలలో జరుగనుంది. 
 
ఇదిలావుంటే, సౌందర్య తన తల్లి లతా రజినీకాంత్‌తో కలిసి మంగళవారం తిరుపతికి వెళ్లి శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నారు. వీరివెంట ఇరు కుటుంబాల సభ్యులతో పాటు మొత్తం 20 మంది వరకు వెళ్లారు. 
 
వీరంతా సోమవారం రాత్రికే పద్మావతి అతిథి గృహంలో బస చేసి మంగళవారం వేకువజామున స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు వివాహ పత్రికను వేంకటేశ్వరుని పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు చేసినట్టు సమాచారం.