మంగళవారం, 4 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 4 ఫిబ్రవరి 2025 (19:40 IST)

మెడలో మంగళసూత్రం బరువైందమ్మా? భర్తకు తేరుకోని షాకిచ్చిన 'మహానటి'!!

keerti suresh
తెలుగు చిత్రపరిశ్రమలో "మహానటి"గా గుర్తింపు పొందిన మలయాళ హీరోయిన్ కీర్తిసురేష్ ఇటీవలే వివాహం చేసుకున్నారు. పెళ్ళయిన కొత్తల్ల మెడలో మంగళసూత్రంతో కనిపించారు. అనేక పబ్లిక్ ఫంక్షన్లు, సినిమా ఈవెంట్స్‌లలో అలాగే కనిపించారు. దీంతో ఆమెను ప్రతి ఒక్కరూ అభినందిస్తూ వచ్చారు. ఇంతలో ఏమైందో ఏమోగానీ, మెడలో మంగళసూత్రాన్ని తొలగించారు. ఇది ఆమె భర్తను సైతం ఒకింత షాక్‍‌కు గురిచేసిందట. పెళ్లయిన రెండు నెలలకే కీర్తి సురేష్ ఇలా నడుచుకోవడంతో ఒకింత అసంతృప్తికి గురవుతున్నట్టు తెలుస్తుంది. 
 
ఈ మధ్య భర్తతో కలిసి చేసిన ఫోటో షూట్‌లో కూడా ఆమె తాళిబొట్టుతో కనిపించలేదు. ఈ ఫోటోలను ఆమె షేర్ చేయడంతో ఈ విషయం తెలిసింది. దీంతో నెటిజన్లు ఆమెపై గట్టిగానే విమర్శలు గుప్పిస్తున్నారు. రెండు నెలలకే మెడలో తాళిబొట్టు బరువైందా అంటూ కీర్తి సురేష్‌ను నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మరి విమర్శకుల చేస్తోన్న ట్రోల్స్‌పై కీర్తి ఎలా స్పందిస్తుందో వేచిచూడాల్సిందే.