శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 1 జులై 2017 (15:32 IST)

బెంగాల్ దాదాతో స్టెప్పులేసిన ''మామ్'' స్టార్ శ్రీదేవి..

''మామ్'' సినిమా ప్రమోషన్‌లో అతిలోకసుందరి శ్రీదేవి బిజీ బిజీగా వుంది. ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమాకు తర్వాత శ్రీదేవి రెండో ఇన్నింగ్స్‌లో రెండో సినిమా ద్వారా ప్రేక్షకులను పలకరించనుంది. హిందీలో ఐదేళ్ల విరామ

''మామ్'' సినిమా ప్రమోషన్‌లో అతిలోకసుందరి శ్రీదేవి బిజీ బిజీగా వుంది. ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమాకు తర్వాత శ్రీదేవి రెండో ఇన్నింగ్స్‌లో రెండో సినిమా ద్వారా ప్రేక్షకులను పలకరించనుంది. హిందీలో ఐదేళ్ల విరామం తర్వాత మామ్‌లో నటించిన శ్రీదేవి, కోల్‌కతాలో మామ్ కోసం చేపట్టిన ప్రచార కార్యక్రమంలో సీనియర్ క్రికెటర్ దాదా సౌరభ్ గంగూలీతో కలిసి శ్రీదేవి న్యత్యం చేసిందని తెలిసింది. 
 
బెంగాలీ టాక్‌షో దాదాగిరికి సౌరభ్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఈ షోకు శ్రీదేవి అతిథిగా హాజరైనట్లు తెలిసింది. ఈ సందర్భంగా తాను నటించిన కొన్ని హిట్ సినిమాల్లోని పాటలకు సౌరభ్ గంగూలీతో కలిసి శ్రీదేవి నృత్యం చేసిందని చిత్ర యూనిట్ వెల్లడించింది. 
 
ఈ షో కోల్‌కతా సినీ ప్రేక్షకులకు అంకితం చేస్తున్నట్లు శ్రీదేవి మామ్ టీమ్ వెల్లడించింది. ఇక ఈ నెల 7న మామ్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మామ్‌లో అక్షయ్ ఖన్నా, నవాజుద్ధీన్ సిద్ధిఖీలు కూడా శ్రీదేవితో కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే.