ఎస్ఎస్ రాజమౌళి డ్యాన్స్ అదరహో (Video)
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఓ వేడుకలో తన సతీమణితో కలిసి చేసిన డ్యాన్స్ తాలూకు వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అమ్మా నాన్నా ఓ తమిళమ్మాయి చిత్రంలోని లంచ్ కొస్తావా మంచె కొస్తావా అనే పాటకు ఆయన తన భార్యతో కలిసి వేసిన స్టెప్పులు అదరహో అన్నట్లు వున్నాయి.
ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఎంఎం కీరవాణి చిన్న కుమారుడు పెండ్లి వేడుక ఫంక్షన్లో ఇలా వారిద్దరూ డ్యాన్స్ చేసినట్లు సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు. ఏదేమైనప్పటికీ నిత్యం సినిమా షూటింగులతో బిజీగానూ, గంభీరంగా కనిపించే రాజమౌళి ఇలా సరదాగా డ్యాన్స్ చేయడం ట్రెండ్ అవుతోంది.