తలసాని శ్రీనివాస్ మా పెద్దలకు చురకలు, కోట్లు తీసుకుంటూ బిల్డింగ్ కట్టలేరా?
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల గురించి జరుగుతున్న చర్చ చూస్తూనే వున్నాం. ఇటీవల తరచుగా కొన్ని మీడియాల్లో ఈ ఎన్నిలకపై చర్చలుకూడా పెడుతున్నారు. ఫైనల్‌గా లోకల్ నాన్ లోకల్ అనే అజెండానే ఎక్కువగా హైలైట్ అవుతుంది.
అయితే మా సభ్యుల్లో దాదాపు 890 మంది మాత్రమే వున్నారు. దానికి ఇంత చర్చ అవసరమా? అంటూ తెలంగాణ సినిమాటోగ్రపీ మంత్రి శ్రీనివాస యాదవ్ విసుగు చెందారు. తనను కలిసిన కొంతమంది మీడియావారి ముందే ఆయన గట్టిగా మాట్లాడారు. మీరెందుకు అంత హైప్ చేస్తున్నారంటూ అక్కడికి వచ్చిన మీడియా పెద్దలను నిలదీశారు. అందుకు వారేమీ సమాధానం ఇవ్వలేకపోయారు. హీరోలు కోట్లు కోట్లు తీసుకుంటున్నారు గదా. కనీసం మా సంఘానికి నూతన భవనం సాధించుకోలేకపోయారా? ఆ వైపుగా మీరెందుకు అడగరని ప్రశ్నించారు.
ఇలా పలు రకాలుగా తెలుగుసినిమా రంగంపై రకరకాల సమస్యల గురించి చర్చ సాగింది. మరోవైపు పెద్ద హీరోలు, నిర్మాతలు ఆయన్ను కలిసి సినిమా టిక్కెట్లు, పార్కింగ్ సమస్యలు వంటివి ప్రభుత్వాన్ని అడిగి మరీ పనిచేయించుకున్నారు. మరి మా అనేది వారి స్వంత సంఘం దానిని ఎందుకు వారు పరిష్కరించుకోలేకపోతున్నారంటూ చికాకు పడ్డారు.
కాగా, ఈ చర్చ సారాంశం సదరు హీరోలకు చేరింది. కానీ వారు ఏమీ మాట్లాడలేదు. ఇలాంటి చిన్న చిన్న స్పర్థలు మామూలేంటూ ఓ పెద్ద హీరో అన్నాడని విశ్వసనీయ సమాచారం. మరి సెప్టెంబర్‌లో జరగబోయే మా ఎన్నికలు ఏవిధంగా వుంటాయనేది త్వరలో తెలుస్తుంది.