బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 14 మే 2018 (15:40 IST)

నాకు ద‌క్కిన గొప్ప వ‌రం వ‌ర‌ల‌క్ష్మి.. ఆమెకు ప్ర‌త్యేక స్థానం: విశాల్‌

తమిళ హీరో విశాల్ వెండితెర‌పైనేకాకుండా నిజజీవితంలో కూడా స‌మ‌స్య‌ల‌తో పోరాటం చేస్తుంటారు. ముఖ్యంగా, కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులోభాగంగా, తన చిత్రాలు విడుదలైనపుడు

తమిళ హీరో విశాల్ వెండితెర‌పైనేకాకుండా నిజజీవితంలో కూడా స‌మ‌స్య‌ల‌తో పోరాటం చేస్తుంటారు. ముఖ్యంగా, కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులోభాగంగా, తన చిత్రాలు విడుదలైనపుడు వసూలయ్యే ఒక్కో టిక్కెట్‌లో ఒక్క రూపాయి రైతుల సంక్షేమానికి చేరేలా చర్యలు తీసుకున్నారు.
 
అంతేనా, న‌డిగ‌ర్ సంఘం కార్య‌ద‌ర్శిగా, నిర్మాత‌ల మండ‌లి అధ్య‌క్షుడిగా విశాల్ బాధ్యతాయుత ప‌ద‌వుల‌ను నిర్వ‌హిస్తున్నాడు. అదేసమయంలో సీనియర్ హీరో శ‌ర‌త్ కుమార్ కూతురు, హీరోయిన్ అయిన వ‌రల‌క్ష్మితో విశాల్ ప్రేమాయణం కొనసాగిస్తున్నాడన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ వార్త‌ల‌ను వారిద్ద‌రూ ధ్రువీక‌రించ‌క‌పోయినా, మీడియాలో వారి ప్రేమ గురించి వ‌చ్చే వార్త‌ల‌ను కూడా ఖండించారు కూడా. 
 
అయినప్పటికీ వారిద్దిర మధ్యా ఏదో ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాగే త‌రచుగా బ‌య‌ట క‌లిసి క‌నిపిస్తుంటారు. తాజాగా జ‌రిగిన 'మిస్టర్ చంద్ర‌మౌళి' సినిమా ఆడియో వేడుక‌కు విశాల్‌, వ‌రల‌క్ష్మి హాజ‌ర‌య్యారు. ప‌క్క‌నే ప‌క్క‌నే కూర్చుని చాలా సేపు మాట్లాడుకున్నారు. 
 
తాజాగా ఓ త‌మిళ పత్రిక‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో విశాల్.. వ‌ర‌ల‌క్ష్మి గురించి మాట్లాడాడు. 'నా జీవితంలో స్నేహితుల‌కు చాలా ప్రాధాన్యం ఉంటుంది. మ‌న‌లోని లోపాల‌ను తెలిపేది, స‌రిదిద్దేది వారే. అలాంటి గొప్ప మిత్ర‌బృందం నాకు ఉంది. అలా నాకు ద‌క్కిన గొప్ప వ‌రం వ‌ర‌ల‌క్ష్మి. త‌ను నాకు 8 ఏళ్లుగా తెలుసు. ఆమె నా జీవితంలో ముఖ్య‌మైన వ్య‌క్తి. నా లోపాల‌ను స‌వ‌రించి న‌న్ను ప్రోత్స‌హించిన ముఖ్య వ్య‌క్తి. నాకు సంబంధించిన అన్ని విష‌యాలూ ఆమెతో పంచుకుంటాను. ఆమెలో ఆత్మ‌విశ్వాసం చాలా ఎక్కువ‌. ఆమె త‌ప్ప‌కుండా రాజ‌కీయాల్లోకి రావాలి' అని విశాల్ వెల్లడించాడు.