సోమవారం, 25 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : ఆదివారం, 11 డిశెంబరు 2022 (19:25 IST)

తారక రామ థియేటర్ ఆసియన్ తారక రామ సినీప్లెక్స్‌ గా మార్పు

Asian Taraka Rama Cineplex
Asian Taraka Rama Cineplex
ఒకప్పుడు దేవి శ్రీదేవి థియేటర్ లు హైదరాబాద్  కాచిగూడ రైల్వే స్టేషన్ రోడ్ లో ఫేమస్. దాని పక్కనే తారక రామ ఉండేది. ఎన్ టి. ఆర్. నిర్మించారు. ఎన్నో విజయవంతమైన సినిమాలు ఆడాయి. కాల క్రమంలో ఒక దశలో అశ్లీల  చిత్రాలు ఆడుతుండేవి. దానితో థియేటర్ కు చెడ్డ పేరు వచ్చింది. కరోనా తర్వాత పూర్తిగా మూతపడింది. ఇప్పడు తారక రామ థియేటర్ పునరుద్ధరించబడింది. ఏషియన్ తారకరామ సినీప్లెక్స్ గా పేరుతో ప్రారంభం కాబోతున్నది. 
 
Asian Taraka Rama Cineplex
Asian Taraka Rama Cineplex
నటసింహం నందమూరి బాలకృష్ణ డిసెంబరు 14న కాచిగూడలోని ఐకానిక్ "ఆసియన్ తారక రామ" సినీప్లెక్స్‌ని తిరిగి ప్రారంభించనున్నారు. థియేటర్ ఇప్పుడు పునరుద్ధరించబడింది. 4k ప్రొజెక్షన్‌తో అమర్చబడింది. నారాయణదాస్ నారంగ్  ఆసియన్ సునీల్  భారత్ నారంగ్. డ్. సురేష్ బాబు కలయికలో అధునాతనంగా మారబోతున్నది. 
 
ఏషియన్ తారకరామ సినీప్లెక్స్ - కాచిగూడ 23, కాచిగూడ రైల్వే స్టేషన్ రోడ్, ఓం హోటల్ హైదరాబాద్ కాంటినెంటల్ సమీపంలో అందుబాటులో ఉన్న సౌకర్యాలు పార్కింగ్ సౌకర్యం కలిగి ఉంది.