శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Updated : బుధవారం, 21 ఆగస్టు 2019 (13:21 IST)

సాహోకి తెలుగుదేశం పార్టీ అండదండలు.. వెనుకున్న కథేంటి?

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తోన్న తాజా చిత్రం "సాహో". ఈ సినిమాకి 'ర‌న్ రాజా ర‌న్' ఫేమ్ సుజిత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. యు.వి.క్రియేష‌న్స్ సంస్థ నిర్మించిన ఈ భారీ బ‌డ్జెట్ చిత్రం ఈ నెల 30న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇప్పుడు సాహో సినిమాకి రాజ‌కీయ రంగు వ‌చ్చింది. సాహో సినిమాకి రాజ‌కీయ రంగు రావ‌డం ఏంటి అనుకుంటున్నారా..? విష‌యం ఏంటంటే... నారా చంద్ర‌బాబు నాయుడు త‌న‌యుడు నారా లోకేష్ సాహో సినిమా గురించి ట్వీట్ చేసి అంద‌రికీ షాక్ ఇచ్చాడు.
 
ఇంత‌కీ ఏమ‌ని ట్వీట్ చేసాడంటే.... అంద‌రిలాగే నేను కూడా సాహో సినిమా కోసం ఎదురు చూస్తున్నాను అన్నారు. నారా లోకేష్ ట్వీట్‌తో ప్ర‌భాస్ సాహోకి తెలుగుదేశం పార్టీ స‌పోర్ట్ ద‌క్కిన‌ట్టు అయ్యింది. ఇది అటు రాజ‌కీయ వ‌ర్గాల్లోను, ఇటు సినీ వ‌ర్గాల్లోను ఆస‌క్తిగా మారింది. నారా లోకేష్ ట్వీట్ పై సాహో టీమ్ ఇప్ప‌టి వ‌ర‌కు స్పందించ‌లేదు. మ‌రి... ప్ర‌భాస్ స్పందిస్తాడేమో చూడాలి.