గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 20 ఆగస్టు 2019 (11:46 IST)

అట్టహాసంగా ''సాహో''.. డార్లింగ్ ఫ్యాన్స్‌కు ఇక పండగే.. వరల్డ్ ఆఫ్ సాహో పేరిట? (video)

బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ నటించిన ''సాహో'' సినిమాను భారీగా విడుదల చేసేందుకు నిర్మాతలు సర్వం సిద్ధం చేసుకున్నారు. భారత దేశంలోని 30 రాష్ట్రాల్లోని మల్టీప్లెక్స్‌లలో ''వరల్డ్ ఆఫ్ సాహో''ను విడుదల చేయనున్నారు.
 
అత్యాధునిక సాంకేతిక పరిణామాలతో రూపొందించిన 'వరల్డ్ ఆఫ్ సాహో'గా పిలుచుకుంటున్న సాహో సినిమాను విడుదల చేస్తారు. సాహోలోని ఉత్కంఠభరితమైన సన్నివేశాల కోసం ఫ్యాన్స్ ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే టీజర్, ట్రైలర్స్, పోస్టర్లు ఊరిస్తున్నాయి. ఇప్పటికే మల్టీప్లెక్స్‌లను పోస్టర్‌లతో పాటు సినిమా పేరు బ్లాక్‌లతో అలంకరించారు. మల్టీప్లెక్స్‌లలో ఒక్క సందు కూడా మిగల్చలేదు.

సాహో పోస్టర్లను అతికించేస్తున్నారు. ఈ పోస్టర్లు మల్టీప్లెక్స్‌ల గొప్పతనాన్ని మరింత పెంచేస్తున్నాయి. 'వరల్డ్ ఆఫ్ సాహో'గా మల్టీప్లెక్స్‌లను రూపొందించిన రాష్ట్రాలు, నగరాల సంగతికి వస్తే.. ముంబై, పూణే, హైదరాబాద్‌లోని తెలంగాణలో పివిఆర్ కూకట్‌పల్లి, పీవీఆర్ మాధాపూర్ మల్టీఫ్లెక్సులు, ఢిల్లీ, పంజాబ్, చండీగడ్‌, మొహాలిల్లోని ప్రధాన ప్రాంతాల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
 
ఛత్తీస్‌గఢ్‌‌లో, రాయ్‌పూర్ ఉత్తరప్రదేశ్, లక్నో, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లో గుజరాత్‌లో, అహ్మదాబాద్, సూరత్  పశ్చిమ బెంగాల్ అభిమానుల కోసం కోల్‌కతాలో - పివిఆర్ మణి స్క్వేర్ అండ్ పివిఆర్ డైమండ్ ప్లాజాలో ఈ సినిమా ప్రదర్శితం కాబోతోంది. ఇప్పటికే సాహో ట్రైలర్ రికార్డులను బ్రేక్ చేస్తోంది. ఇక దేశవ్యాప్తంగా ఉన్న తన అభిమానులకు పండుగచేసుకునేందుకు ఆగస్టు 30ను ప్రపంచ సాహో దినోత్సవంగా ప్రభాస్ ప్రకటించారు.
 
హిందీ, తమిళం, తెలుగు అనే మూడు భాషల్లో ఒకేసారి రూపొందిన ఈ చిత్రంలో ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా నటించగా, జాకీ ష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్, మందిరా బేడి, చంకీ పాండే, మహేష్ మంజ్రేకర్, అరుణ్ విజయ్, మురళి శర్మ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.