గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 19 ఆగస్టు 2019 (13:45 IST)

ప్రీ రిలీజ్ రికార్డులు ... రూ.333 కోట్లు కొల్లగొట్టిన "సాహో"

'బాహుబలి' స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం "సాహో". ఈ చిత్రం ఈ నెల 30వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. సుజిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించగా, బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా దాస్ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక ఆదివారం రాత్రి జరిగింది. పైగా, ఈ చిత్రం ట్రైలర్ ఈ సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది. 
 
ఏక కాలంలో తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదలవుతోంది. అయితే, ప్రభాస్‌పై ఉన్న నమ్మకంతో ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డు స్థాయిలో జరిగింది. ముఖ్యంగా, సినీ వర్గాల సమాచారం ఇప్పటివరకు రూ.333 కోట్ల మేరకు ప్రీ రిలీజ్ వ్యాపారం జరిగినట్టు వార్తలు వస్తున్నాయి. 
 
ఇందులో నైజాంలో రూ.40 కోట్లు, సీడెడ్‌లో రూ.25 కోట్లు, కృష్ణలో రూ.8 కోట్లు, గుంటూరులో రూ.12.50 కోట్లు, నెల్లూరులో రూ.4.50 కోట్లు, వెస్ట్, ఈస్ట్ ఏరియాల్లో రూ.19 కోట్లు, ఉత్తరాంధ్ర రూ.16 కోట్లతో కలుపుకుని మొత్తంగా రెండు తెలుగురాష్ట్రాల్లో రూ.125 కోట్ల మేరకు ప్రీ రిలీజ్ వ్యాపారం జరిగినట్టు సమాచారం. 
 
అలాగే, కర్ణాటకలో రూ.28 కోట్లు, తమిళనాడు, రెస్టాఫ్ ఇండియాలో రూ.18 కోట్లు, బాలీవుడ్‌లో రూ.120 కో, ఓవర్ సీస్‌లో 42 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ వ్యాపారం జరిగినట్లు ట్రేడ్ వర్గాల టాక్. అంటే దాదాపు రూ.333 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని సమాచారం. మరి వసూళ్ళ పరంగా ఈ చిత్రం ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో వేచి చూడాల్సిందే.