శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 21 డిశెంబరు 2020 (20:11 IST)

న్యూఇయర్ రోజున తనతో గడిపేందుకు చిత్రను ఆహ్వానించిన రాజకీయ నేత!? (video)

ఇటీవల ఆత్మహత్య చేసుకున్న తమిళ బుల్లితెర నటి చిత్ర ఆత్మహత్య కేసులో ఇపుడు సరికొత్త విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. చిత్రకు అనేక మందితో సంబంధాలు ఉన్నట్టు ఈకేసులో ప్రధాన నిందితుడైన చిత్ర ప్రియుడు హేమనాథ్ తండ్రి రవిచంద్రన్ ఆరోపిస్తున్నాడు. చిత్రతో ఓ రాజకీయ నాయకుడు తరచూ ఫోనులో మాట్లాడేవారనీ, కొత్త సంవత్సరం రోజున తనతో గడిపేందుకు రావాలని ఆహ్వానించాడని రవిచంద్రన్ ఆరోపిస్తున్నాడు. 
 
చిత్ర ఆత్మహత్య కేసులో ఇప్పటికే ఆమె ప్రియుడు హేమనాథ్‌ను అరెస్టు చేసిన విషయం తెల్సిందే. ఈ కేసుపై హేమనాథ్ తండ్రి రవిచంద్రన్ స్పందిస్తూ, చిత్ర ఆత్మహత్యకు ప్రేరేపించిన మూడో వ్యక్తిని కనుగొని చట్టం ఎదుట హాజరుపరచాలని రవిచంద్రన్‌ చెన్నై నగర పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. 
 
చిత్ర ‘కాల్స్‌’ అనే తమిళ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ఆ చిత్రం విడుదల కాకముందే ఆమె ఈనెల 9న పూందమల్లి సమీపం నజరత్‌పేట హోటల్‌లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు రంగంలోకి దిగి ఆరురోజులపాటు హేమనాథ్‌ను విచారించిన మీదట చిత్రను ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించాడనే నేరారోపణపై అతడిని పుళల్‌ జైలుకు తరలించారు. హేమనాథ్‌ అరెస్టుపై అతడి తండ్రి రవిచంద్రన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
చిత్ర తన కుమారుడిని ప్రేమించకమునుపే మరో ముగ్గరిని ప్రేమించిందని వారిలో ఒకరితో నిశ్చితార్థం చేసుకోవాలని కూడా ప్రయత్నించిందని ఆయన ఆరోపించారు. ఓ టీవీ యాంకర్‌తోనూ చిత్రకు సంబంధాలున్నాయని, రాజకీయ నాయకుడొకరు చిత్రతో తరచూ సెల్‌ఫోన్‌లో మాట్లాడేవారన్నారు.
 
రాజకీయ నాయకుడు చిత్రకు ఫోన్‌ చేసి న్యూఇయర్‌ సందర్భంగా తనతో గడిపేందుకు రమ్మని ఫోన్‌లో ఆహ్వానించినట్టు కూడా తెలిసిందని రవిచంద్రన్ ఆరోపిస్తున్నాడు. ఏది ఏమైనప్పటికీ పోలీసుల విచారణలో వాస్తవాలు తెలియాల్సి ఉంది.